hair growth tips with aloe vera

5 నిమిషాలు ఇలా చేస్తే చాలు మీ జుట్టు వద్దన్నా ఎంత ఒత్తుగా పొడవుగా పెరుగుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు

జుట్టు రాలిపోవడం, పలచబడడం బట్టతలలా కనిపించడం వలన ఇబ్బంది పడుతున్నారా. అలా జుట్టు రాలడం కొనసాగితే త్వరలోనే పూర్తిగా బట్టతల వచ్చే అవకాశం ఉంది. అందుకే  ఈసారి షాంపూతో ఇప్పుడు చెప్పబోయే  పదార్థాలు రెండు కలిపి రాయడంవలన జుట్టు ఒత్తుగా, బలంగా తయారవుతుంది. ఇవేమీ పాక్ వేసుకున్నట్టు గంటలపాటు కూర్చునే అవసరం లేదు. అంతేకాకుండా చిట్లిన చిగుళ్ళు, తెగిపోవడం ఆగుతుంది. జుట్టు రాలడానికి సరైన శ్రద్ద చూపకపోవడం, లేదా జెనెటిక్ సమస్యలు, కాలుష్యం, ఒత్తిడి కారణమవుతాయి. చాలామంది దువ్వుతున్నా లేదా తడి తలను తుడిచినపుడు వెంట్రుకలు రాలడం గమనించొచ్చు. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

అందుకే షాంపూలో ఇవి కలిపి రాయడంద్వారా జుట్టురాలడం ఆగిపోవడం గమనిస్తారు. అందుకోసం ఒక పావుకప్పు బియ్యం తీసుకుని బియ్యం శుభ్రంగా కడిగి అందులో నీళ్ళు పోసుకొని ఉంచుకోవాలి. కడగడం వలన బియ్యంపై ఉండే దుమ్ము, పాలిష్ వెళ్ళిపోతుంది. అలాగే బియ్యం కనీసం రెండు గంటలు నానబెట్టుకోవాలి. వీలైతే రాత్రంతా ఉంచినా మంచిదే. తర్వాత ఆ నీటిని తీసుకుని విటమిన్ బి, సి, ఇ తోపాటు ఎమినోయాసిడ్స్ ఉంటాయి. అలాగే మిగిలిన బియ్యాన్ని మామూలుగా వంటకి వాడుకోవచ్చు. బియ్యం నీరు ఉపయోగించడం వలన చుండ్రు శుభ్రపడి దురదలు తగ్గుతాయి. పొడిబారిన జుట్టు  తేమగా, బలంగా తయారవుతుంది.

 అలాగే తాజా అలొవెరా గుజ్జు తీసుకోవాలి. లేదంటే మార్కెట్లో దొరికే జెల్ తీసుకోవచ్చు. ఈ అలొవెరాలో కూడా ఎమినోయాసిడ్స్, ప్రొక్యో జైట్ ఎంజైములు కూడా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్ళకు బలాన్ని అందించి ఆరోగ్యంగా తయారుచేస్తాయి. తర్వాత మీరు ఉపయోగించే షాంపూ తీసుకొని ఒక స్పూన్ షాంపూ కూడా వేసి బాగా కలపాలి. అలాగే తేనె మీ చర్మానికి పడితే వేసుకోవచ్చు. మీరు షాంపూ పెట్టి నట్టే జుట్టుకు పట్టించి ఐదునిమిషాలు తర్వాత మామూలు నీళ్ళతో స్నానం చేయొచ్చు. ఒక నెల రోజులలో మంచి ఫలితం ఉంటుంది. దీనివలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇది ఉపయోగించడంవలన జుట్టు మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!