Hair Growth Treatment at Home Glowing Skin

ఎన్ని వాడినా పెరగని జుట్టు గంజినీలను ఇలా ఉపయోగిస్తే ఒత్తుగా పెరుగుతుంది…….. మరియు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది………

వయసులో ఉన్న పిల్లలందరికీ ముఖంపై మొటిమలు వంటివి సర్వసాధారణంగా వాస్తు ఉంటాయి. ఇటువంటి మొటిమలు రాకుండా చర్మాన్ని స్మూత్ గా, మంచి కాంతివంతంగా ఉంచుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా బాగా పనిచేస్తుంది. దీనికోసం అన్నం వర్చగ వచ్చిన గంజితో చేసే మసాజ్ బాగా ఉపయోగపడుతుంది అని 2010 సంవత్సరంలో జపాన్ వారు నిరూపించారు. మామూలుగా అన్నం వర్చగ వచ్చిన మంచి క్వాలిటీ గంజిలో ఒక స్పూన్ పసుపు కలుపుకొని ఈ రెండిటి యొక్క మిశ్రమాన్ని ముఖానికి బాగా మసాజ్ చేయాలి.

ఇలా చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు లేదా అరగంటసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖంను కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా గంజిలో ఉండే స్మూత్ నెస్ మన చర్మానికి వస్తుంది. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది. ఇందులో పసుపు కలుపుకోవడం వలన చర్మంపై చేరిన వైరస్, బ్యాక్టీరియాలను నిర్మూలిస్తుంది. దీనివలన చర్మం పాడవదు. అంతేకాకుండా వైరస్, బ్యాక్టీరియాలు బయటి నుంచి లోపలికి చేరి ఇన్ఫెక్షన్స్ కలిగించడం వల్ల వచ్చే మొటిమలు వంటి వాటిని రాకుండా నిర్మూలిస్తుంది.

ఇలా రోజు చేయడం ద్వారా ముఖం పైన ఉన్న వైరస్ బ్యాక్టీరియాలను ఏ రోజుకు ఆ రోజు క్లీన్ చేసుకుని చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి మొటిమలు మచ్చలు వంటివి రాకుండా ఉండడానికి ఈ ప్యాక్ నాచురల్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా పూర్వం రోజుల్లో కూడా గంజిని తీసుకొని జుట్టుకు అప్లై చేసేవాళ్ళు. ఇలా చేయడం ద్వారా జుట్టు ఊడకుండా షైనీగా ఉండడానికి, జుట్టు ఎదుగుదల బాగా ఉండడానికి ఈ గంజి ట్రీట్మెంట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో కూడా ఇలా గంజి ట్రీట్మెంట్ ఉపయోగించడం వలన మన జుట్టుకు మంచి ప్రయోజనాలు ఉంటాయి.

కనుక మన ఇంట్లో లభించే గంజిని ముఖ సౌందర్యం మరియు జుట్టు పెంచుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ గంజిని తాగడం ద్వారా శరీరంలో వచ్చే అలసట నుంచి విడుదల పొందవచ్చు. దీనివలన తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. ఇటువంటి గంజిని పారబోయకుండా ఏదో ఒక రూపంలో ఉపయోగించుకోవడం ద్వారా మనకు బహిర్గతంగాను, అంతర్గతంగాను చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కనుక గంజినే ఉపయోగించడం మనకు చాలా మంచిది.

Leave a Comment

error: Content is protected !!