హల్లో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో చిన్నా, పెద్దఅనే తారతమ్యం లేకుండా జుట్టు సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి.అందులో ముఖ్యంగా,
జుట్టు రాలడం,పలచబడి పోవడం, వెంట్రుకలు చిట్లడం, మరీ ముఖ్యంగా,అతి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం జరుగుతుంది. ఇలా జరగడం వలన మనసులో చాలా ఆందోళనగా ఉండడమే కాకుండా,బయటకు వెళ్ళాలన్నాఎంతో ఇబ్బందిగా ఉంటుంది. వీటన్నిటికి చెక్ పెట్టేస్తూ మనం ఒక్క చిన్న చిట్కాను పాటించడం ద్వారా, మనంజుట్టు సమస్యలు రాకుండా చూసుకుంటూ అందమైన ,ఆరోగ్యమైన జుట్టును మన సొంతం చేసుకుందాం.
ఇప్పుడు మనం జుట్టు సమస్యలను అధిగమించి జీవితాంతం జుట్టు సమస్యలు లేకుండా ఉండడానికి ఒక నూనెను తయారు చేసుకుందాం. దీని తయారి కి అవసరం అయ్యే పదార్థాలు చూద్దాం.
నూనె తయారీ విధానానికి కావలసిన పదార్థాలు.
ముందుగా,పచ్చి కరివేపాకుని మనకు కావలసిన అంత తీసుకోవాలి.ఇందులో సల్ఫర్, మరియు పోషక పదార్థాలు ఎక్కువుగా ఉండడం వలన జుట్టు చాలా ఒత్తుగా, నల్లగా, బలంగా, ఉండ డానికి ఉపయోగపడుతుంది.
మెంతులు :ఈ మెంతులను మన పూర్వీకుల నుండి వాడబడుతున్న విషయం మనకు తెలుసు.వీటిలో బీటకేరోటిన్,యాంటీఆక్సిడెంట్లు,విటమిన్ ఎ చాలా ఎక్కువగా ఉండడం వలన జుట్టు ఊడకుండా చాలా ఒత్తుగా పెరుగుతుంది.అంతేకాకుండా,ఇందులో ఫారాఫినాల్,ప్లవనెట్స్ ఎక్కువగా ఉండడం వలన జుట్టులో ఉన్న రాడికల్స్ ను తొలగించి,చర్మంలోని తేమ శాతం ఎక్కువగా పెంచుతుంది.
ఆయిల్ స్కిన్ కలవారిలో చుండ్రు ఎక్కువగా ఉంటుంది. దీని వలన జుట్టు ఊడిపోవడం జరుగుతుంది.కాబట్టి ఈ మెంతుల వలన ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వలన చుండ్రు బాగా తగ్గుతుంది. అంతే కాకుండా సోరియాసిస్ రాకుండా కాపాడుతుంది.
ఆవనూనె:.ఈ నూనెలో ఎన్నో పోషకవిలువలుఉండడం వలన జుట్టు మెరవడం,బలంగా ,మెత్తని పట్టులాగ కురులు ఆరోగ్యంగా,కుచ్చులాఉండడానికి ఎంతో అవసరం.
ఇప్పుడు దీని తయారి విధానం తెలుసుకుందాం.
ఒక చిన్న మూకుడు స్టౌవ్ మీద ఉంచి అందులో కాస్త ఆవనూనెను వెయ్యాలి .ఆ నూనెలో పచ్చి కరివేపాకు,ఒక్క చెంచా చొప్పున మెంతులు వెయ్యాలి.ఇవ్వన్నీ బాగా ఉడికి వాటిలోని పోషక పదార్థాలన్నీ ఆనూనెలోకి రావాలి. అప్పుడు దానిని కిందకు దించి వడపపోసుకొని ఒక్క గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
దీనిని వాడే విధానం.
ఈ నూనెను వారానికి ఒక్కసారి తల అంతా పెట్టుకొని,ఒక్క అరగంట సేపు అలాగే ఉంచి తరువాత మీరు వాడే షాంపూతో తలస్నానం చేయాలి. సమస్య ఎక్కువగా ఉన్న వారు వారానికి రెండు రోజుల దీనిని వాడడం వలన జుట్టు సమస్యలు దూరం కావడానికి ఎంతో అవకాశం ఉంది.దీనిని చాలా ఓపికగా వాడడం వలన కచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.దీనిని పిల్లలు,పెద్దలు అందరూ దీనిని వాడవచ్చు.