hair loss control with curry leaves

కరివేపాకుతో ఇలా చేస్తే జన్మ లో జుట్టు రాలమన్న రాలదు…ఇది నిజం| Curry Leaf for Hair

ఈ కాలంలో జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. అది స్త్రీలలోను పురుషులలోనూ ఉంటుంది. జుట్టు రాలడానికి పోషకాహార లోపం,  టెన్షన్, ఒత్తిడి, చుండ్రు వంటివి కా‌ణాలుగా చెప్పవచ్చు. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అందరూ కంగారు పడుతుంటారు. అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరు చెప్పా‌రని మార్కెట్లో ప్రోడక్ట్స్ వాడుతుంటారు. వాటికోసం వేలకొలది డబ్బులు ఖర్చుపెట్టకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇంటిచిట్కాలు పాటించవచ్చు. ఇప్పుడు చెప్పబోతున్న చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. 

జుట్టు కుదుళ్ళకు బలంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు అందేలా చేయాలి. అప్పుడు జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ చిట్కా కోసం నాలుగు పదార్థాలు వాడుతున్నాం. అవన్నీ ఇంట్లో అందుబాటులో ఉంటాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రెమిడీని వారంలో రెండు సార్లు పాటించాలి. క్రమంగా జుట్టు రాలె సమస్య తొలగిపోతుంది. దీనికోసం స్టౌ వెలిగించి నీళ్ళు పెట్టి దాంట్లో కరివేపాకు వేయాలి. కరివేపాకు అందరికీ అందుబాటులో ఉంటుంది. దాంట్లో జుట్టును ధృడంగా చేసే ఎన్నో ఔషధాగుణాలు ఉంటాయి. 

జుట్టు ఒత్తుగా చేస్తుంది. కరివేపాకు లో బీటాకెరోటిన్, ప్రోటీన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది. కరివేపాకు లో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తాయి. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. దీంట్లో ఒక స్పూన్ మెంతులను వేసుకోవాలి. మెంతులలో ఉండే బీటాకెరోటిన్, విటమిన్ ఎ, ప్రీరాడికల్స్ని  నిరోధించి తెల్లజుట్టును తగ్గిస్తుంది. జుట్టు మెరుస్తూ ఉండేలా చేస్తుంది. 

ఇందులో ఉండే ఫాలీపినాల్స్, ఫ్లెవనాయిడ్స్ జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేసి కండిషనర్గా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైటో స్టెరాల్స్, ఫైటోఈస్ట్రోజన్స్ జుట్టు ను ధృడంగా ఉండేలా చేస్తాయి. జుట్టు లో ఉండే చుండ్రును తగ్గిస్తుంది. దీంట్లో ఒక చిన్న స్పూన్ కాఫీ పౌడర్ వేయాలి. కాఫీ పౌడర్ మాడుపై రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. తలపై చర్మ కణాలు శుభ్రపడి మృతకణాలు తొలగిపోయేలా చేస్తుంది. చుండ్రు సమస్య తగ్గిపోతుంది. చుండ్రు జుట్టు రాలడానికి కారణం. జుట్టు వేగంగా పెరగడానికి, ధృడంగా మారడానికి సహాయపడుతుంది. 

ఈ నీటిని ఐదునుండి ఏడునిమిషాలు మరిగించాక వాటిలోని పోషకాలు  నీటిలోనికి దిగాలి. తర్వాత నీటిని వడకట్టాలి. దీంట్లో కొబ్బరినూనె కలపాలి. స్వచ్ఛమైన కొబ్బరినూనె తీసుకోవాలి. ఆర్గానిక్ అయితే మంచిది. కొబ్బరినూనెలో అనేక పోషకాలు జుట్టు సమస్యలు తగ్గించి ధృడంగా పెరిగెలా చేస్తుంది. కొబ్బరినూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియా లక్షణాలు జుట్టు పోషణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. జుట్టు కుదుళ్ళలో బలంగా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా చేస్తుంది.ఇది తలకు పట్టించి ఆ తర్వాత మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు చేస్తుంటే జుట్టు సమస్యలు తగ్గుముఖం పడతాయి. కాస్త ఓపికగా చేస్తుంటే త్వరలోనే మంచి ఫలితాలు ఉంటాయి.

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

Leave a Comment

error: Content is protected !!