కొంతమందికి అది చిన్న వయసులోనే ముసలి వాళ్ళ లాగా కనిపిస్తారు. చర్మంపై ముడతలు రావడం, చర్మం లూజుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గించి 60 లో కూడా 30లాగా కనిపించేటట్లు చేసే అద్భుతమైన చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాంటీఏజింగ్ లక్షణాలను తగ్గించుకోవడం కోసం చాలామంది రకరకాల క్రీములను ఉపయోగిస్తూ ఉంటారు. వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. కెమికల్స్ ఉన్న క్రీములను ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి.
చర్మం పై రకరకాల క్రీములను ఉపయోగించడం, పొల్యూషన్ వలన కూడా ఆంటీ ఏజెనింగ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. చర్మం పై ముడుతలు చర్మం బిజీగా ఉండటం వంటి సమస్యలు తగ్గించుకోవడం కోసం ఈ చిట్కాని ఉపయోగించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం ముందుగా అవిసె గింజలను తీసుకుని దోరగా వేయించుకోవాలి. అవిసె గింజలను కొంచెం చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
అవిస గింజలు చర్మాన్ని టైట్ గా చేయడంలోని మరియు చర్మం ముడతలు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ పై తొక్క మాత్రమే తీసుకొని రోజ్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడం అయిన తర్వాత ఒక బౌల్ లోకి వడ కట్టుకొని తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని రెండు చెంచాల అవిసగింజల పౌడరు వేసుకోవాలి. మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న రోజ్ వాటర్, లెమన్ పీల్ జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ఈ ప్యాక్ ను అప్లై చేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత రోజ్ వాటర్ ను స్ప్రే చేయాలి. పదినిమిషాల తర్వాత మళ్ళీ రోజ్ వాటర్ ను స్ప్రే చేయాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారం రోజులపాటు చేసినట్లయితే ముడతలు రావడం, స్కిన్ లూస్ వంటి సమస్యలు తగ్గుతాయి. మీ వయసు తక్కువ అయినప్పటికీ ఈ లక్షణాలు వల్ల ఎక్కువ వయసు వచ్చిన వాళ్ళలా కనిపిస్తారు.
కానీ ఈ చిట్కా ఉపయోగించినట్లయితే మీరు చిన్న వయసు వారులా కనిపిస్తారు. ఈ చిట్కా మీకు కూడా అవసరం అయితే ఒక సారి ట్రై చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది. వరుసగా వారం రోజులు ఉపయోగించి తర్వాత ఎప్పుడైనా మీకు అవసరం అనిపించినపుడు వేసుకుంటే సరిపోతుంది.