hair regrowth treatment

100% జుట్టు ఒత్తుగా పొడవుగా పెంచే హెయిర్ ఆయిల్, కొబ్బరి నూనె లో ఇది కలిపి రాయండి చాలు

 ప్రస్తుతం  ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ ను ఉపయోగిస్తారు. వాటిలో కెమికల్స్ ఉండటం వలన అనేక  సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తగ్గించుకోవచ్చు. దీనికోసం ముందుగా 100  గ్రాముల కొబ్బరి నూనె తీసుకోవాలి. తర్వాత నాలుగు రెమ్మలు వేపాకులను తీసుకోవాలి. వేపాకు లో విటమిన్  ఈ పుష్కలంగా ఉంటుంది.

       ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి తలలో చుండ్రు, దురద,  ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత రెండు చెంచాల మెంతులు తీసుకోవాలి.  మెంతులు బీటాకెరోటిన్ అధికంగా కలిగి ఉంటాయి.  బీటా కెరోటిన్ జుట్టు రాలడం తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టును సిల్కీగా చేసి కండిషనర్ గా కూడా  ఉపయోగపడతాయి. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వలన కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

      కర్వేపాకు డైరెక్ట్ గా ఆహారంలో ఉపయోగించడం వల్ల చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను  తగ్గిస్తాయి. ఇవి జుట్టు రాలడం తగ్గించి  జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం లో సహాయపడతాయి. కర్వేపాకు, వేపాకు, మెంతులు వేసి  నీళ్ళు వేసుకోకుండా పౌడర్ లాగా మిక్సీ  పట్టుకోవాలి. ఈ  పౌడర్ను ముందుగా తీసి పక్కన పెట్టుకున్న కొబ్బరి నూనెలో  వేసి  బాగా కలుపుకోవాలి. తరువాత డబల్ బాయిలర్ పద్ధతిలో వేడి చేసుకోవాలి.   నూనె డైరెక్ట్ గా వేడిచేయడం వల్ల దానిలో ఉండే పోషకాలు బయటికి పోతాయి.

       డబల్ బాయిలర్ పద్ధతిలో  వేడి చేసుకోవడం వల్ల దానిలో ఉండే పోషకాలు నూనెలోకి దిగుతాయి.   ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఈ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.  ఈ నూనె ఏదైనా గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకొని ప్రతి రోజు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న ప్రతిసారీ డబల్ బాయిలర్ పద్ధతిలో వేడి చేసుకొని అప్లై చేసుకోవాలి.

      గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకోవడం వల్ల ప్రయోజనాలు బాగా  కలుగుతాయి. ఈ నూనెను ప్రతి రోజూ హెయిర్ ఆయిల్ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె రెండు లేదా మూడు రోజులు ఉపయోగించడం వల్ల తేడా మీరే గమనిస్తారు.

Leave a Comment

error: Content is protected !!