hair white problem solution

ఐదు నిమిషాలలో ఎంత తెల్ల జుట్టు ఉన్నా సరే నల్లగా మార్చేస్తుంది….. మీరే ప్రయత్నించి చూడండి……..

                    వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత కాలంలో అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య తెల్ల జుట్టు. ఈ తెల్ల జుట్టు అనేది ప్రస్తుత కాలంలో వస్తున్న మార్పులు వలన ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా పోషకాహార లోపం వలన కూడా వస్తుంది. మరియు మన తలలో మెలానీన్ లోపం వలన కూడా జుట్టు తెల్లగా ఉంటుంది. ఆ కారణంగా సమాజంలో కలవడానికి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు భయపడుతున్నారు. ఈ తెల్ల జుట్టు నుంచి విడుదల పొందడానికి ఎన్నో హెయిర్ కలర్స్ ఉపయోగిస్తున్నారు.

వీటిని ఉపయోగించడం వలన అందులో ఉండే అమ్మోనియం వంటి కెమికల్స్ వలన మన జుట్టు రాలిపోవడం వంటి కొత్త సమస్యలకు కూడా దారితీస్తుంది. మరియు ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ ఉపయోగించడం ద్వారా కూడా ఎటువంటి ఫలితం లేదనుకునేవారు ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెమిడి వలన మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉపయోగించేవి అన్ని మన ఇంట్లో లభించేవి కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక దీనిని చిన్నవారి నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు.
                ఈ రెమిడి తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది ఉల్లిపాయ తొక్కలు. ఉల్లిపాయ మన జుట్టును దృఢంగా చేయడంతో పాటు తెల్ల జుట్టు నివారించడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా చుండ్రు వంటి సమస్యల నుంచి కూడా విడుదల అందిస్తుంది. ఇప్పుడు ఒక ఇనుప కడాయిని తీసుకొని స్టవ్ పై పెట్టుకొని దానిలో ఉల్లి తొక్కలను వేసుకోవాలి. సన్నని మంటపై ఉల్లి తొక్కలు రంగు మారేంతవరకు కలుపుతు వేయించుకోవాలి. ఇలా పది నిమిషాల పాటు వేయిస్తే ఉల్లి తొక్కలు నలుపు వర్ణంలోకి వస్తాయి. ఇప్పుడు ఉల్లి తొక్కలను ఏదైనా గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి.
                    ఇలా చల్లారిన తర్వాత ఉల్లి తొక్కలను చేత్తో లేదా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి లాగా చేసుకుని జల్లెడ సహాయంతో జల్లించుకోవాలి. ఇలా జల్లించగా వచ్చిన పొడిని మన జుట్టుకు సరిపడినంత తీసుకొని అందులో ఒక స్పూన్ వెజీలిన్ కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమం మన జుట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా ఒక రోజు రాత్రి మొత్తం ఉంచుకోవాలి. ఆ తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ ఉపయోగించి తల స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా క్రమేణా జుట్టు నల్లబడుతుంది…..

Leave a Comment

error: Content is protected !!