Hand Sanitizer Safety Precautions

శానిటైజర్…… ష్…… జాగ్రత్త

మనదేశంలో శానిటైజర్ పేరు విన్నది 90% కరోనా వచ్చిన తరువాతనే అంటే ఆశ్చర్యం వేస్తుంది. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటివి వాడటం చాలా తక్కువ. అయితే కరోనా కేవలం జబ్బునే కాదు శానిటైజర్లు, హాండ్ వాష్ లు, ఇంటిని శుభ్రం చేయడానికి వాడే పదార్థాలు వీటన్నింటి అమ్మకాలను ఒక్కసారిగా పెంచేసింది. అయితే చాలా మంది శానిటైజర్ వాడటం చాలా ప్రమాదం అని అంటున్నారు. అసలు మనం శానిటైజర్ ఎందుకు వాడుతున్నాం?? దానివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి?? ఒక్కసారి విశ్లేషిద్దాం రండి.

అసలు శానిటైజర్ ఏంటి?? అందులో ఏముంది??

శానిటైజర్ తయారీలో ఇథనాల్, గ్లిసరాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ వంటి రసాయన పదార్థాలను వినియోగిస్తారు. వీటిని ఒక మోతాదులో లాబ్ సూచనల కొలతల ప్రకారం కలపడం వల్ల శానిటైజర్ తయారవుతుంది.  ఇందులో ఉన్న ఆల్కహాల్ గుణం బాక్టీరియాను చంపుతుంది.  అందుకే ఈ కరోనా కాలం లో చాలా మంది శానిటైజర్ వినియోగిస్తున్నారు. అయితే దీని వాడకం మంచిదేనా??

శానిటైజర్ వల్ల లాభాలు

శానిటైజర్ ను వినియోగించమని ప్రభుత్వాల నుండి, ఆరోగ్య నిపుణుల వరకు ఎందరో సలహాలు ఇచ్చారు. అయితే శానిటైజర్ ను బయట నుండి ఇంట్లోకి వచ్చినపుడు, బయట తప్పనిసరిగా వస్తువులను ముట్టిన తరువాత, ఎవరికైనా కాస్త దగ్గర ఉండి మాట్లాడిన సందర్భాలలో శానిటైజర్ ను వాడాలి. దీనివల్ల రోజు మొత్తం అభద్రత నుండి తొలగిపోయి సంతోషంగా ఉండచ్చు.

శానిటైజర్ వల్ల నష్టాలు

కరోనా అనే భయం తో శానిటైజర్ అమ్మకాలు ఎలాగైతే పెరిగాయో, వాడకం కూడా అలాగే పెరిగింది. ఉదయం లేచింది మొదలు, నిద్రపోయేలోపు ప్రతి ఇంట్లో కనీసం ఒక శానిటైజర్ బాటల్ కాళీ అవుతుందంటే వీటి వాడకం ఎంత భీభత్సంగా ఉందొ అర్థమవుతుంది. నిమిషాలు, గంటల వ్యవదిలో పదుల సార్లు శానిటైజర్ వాడటం వల్ల చేతుల మీద ఆరోగ్యకరమైన బాక్టీరియా నశించి మన రోగ నిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది. అంతే కాదు శానిటైజర్ లో ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉండటం వల్ల ఉపయోగించిన వెంటనే గాస్ స్టవ్ వంటి మండే స్వభావం ఉన్నవాటికీ దూరంగా ఉండటం ఉత్తమం.

ఇంకా ముఖ్యంగా కొన్నిటిలో ఆల్కహాల్ శాతం తక్కువ వుండటం వల్ల బాక్ట్రిరియా చంపకపోగా చర్మ సమస్యలు రావడం ,దద్దుర్లు, రాషెస్, చేతులు మండటం వంటి సమస్యలు ఎదుర్కుంటున్నట్టు రోజు ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉన్నాం. చర్మం పొడిబారటం, ఎర్రబడటం వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నట్టు పలు వినియోగదారులు చెబుతూనే ఉన్నారు. కొసమెరుపు ఏంటంటే ప్రస్తుత అమ్మకాల్లో ఉన్న శానిటైజర్లు 80% నకిలివే, ఇవన్నీ ఎలాంటి లాబ్ లలో తయారవడం లేదు. బోగస్ కంపెనీళ్లు ఇష్టానుసారం వీటిని తయారు చేసి అమ్ముతున్నాయ్. అందుకే మరి శానిటైజర్ తో జాగ్రత్త….. 

Leave a Comment

error: Content is protected !!