భారతీయ సాంప్రదాయంలో అరటి ఆకుకు ఉన్న విశిష్టత మాటల్లో చెప్పలేనిది. చాలా శుభకార్యాలలో అరటి ఆకు భోజనం తప్పకుండా ఉంటుంది. మన పెద్దల కాలంలో తప్పకుండా అరటి ఆకులోనే రోజూ భోజనం చేసెవారు. తరువాత ఫాషన్ కంచాలు వచ్చి అరటి ఆకుల వాడకం తగ్గింది. కానీ అరటి ఆకులలో భోజనం చేయడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు ఉన్నాయ్ చూద్దాం మరి.
◆ తాజా అరటి ఆకులు చాలా సన్నని మైనపు పూతను కలిగి ఉంటాయి, దానిపై వేడి ఆహారాన్ని వడ్డించినప్పుడు కరుగుతుంది. ఈ మైనపు లాంటి పూత ఆహ్లాదకరమైన వాసనను విడుదల చేస్తుంది మరియు ఆహారంలో అదనపు రుచిని కలిగిస్తుంది. తినేటప్పుడు తాజా రుచిని మరియు అద్భుతమైన పరిమళాన్ని ఆస్వాదించవచ్చు. .
◆ యాంటీఆక్సిడెంట్ గుణాలు స్వతహాగా ఆరోగ్యానికి మంచివి. అరటి ఆకులు కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ మాత్రమే కాదు, అరటి ఆకు ప్రకృతిసిద్ధమైన యాంటీ బాక్టీరియల్ కూడా. అందువల్ల ఆహారంలో సూక్ష్మక్రిములను చంపగలదు. అరటి ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నయం చేయడంలో సహాయపడతాయి. అలాగే పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారికి అరటి ఆకు భోజనం వల్ల తొందరగా నయమవుతుంది.
◆ ప్లాస్టిక్ ప్లేట్లు లేదా స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లను సబ్బులు లేదా డిటర్జెంట్ల ద్వారా శుభ్రం చేసినప్పుడు, ఈ డిటర్జెంట్ల యొక్క హానికరమైన రసాయనాలు పాత్రలకు అంటుకుంటాయి. ఇవి పాక్షికంగా ఆహారంతో కలిసిపోతాయి అరటి ఆకులలో భోజనం చేయడం వల్ల ఈ సమస్యలు ఏవి ఉండవు.
◆ఆయుర్వేదం ప్రకారం అరటి ఆకులలో భోజనం శ్రేష్ఠమైనది. ఈ ఆకులతో భోజనం చేయడం వల్ల ఆహారంలో ఏదైనా విషపదార్థం కలిసి ఉన్నట్టైతే అరటి ఆకుకు ఆ విషాన్ని పీల్చే గుణం ఉంది. తద్వారా ఆకు మొత్తం నల్లబడి ఆహారపదార్థ స్వరూపాన్ని తెలియజేస్తుంది. అలాగే అరటి ఆకులలో భోజనం చేసి పడేసినపుడు తొందరగా కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతాయి. దీనివల్ల ఎలాంటి ప్రకృతి నష్టం వాటిల్లదు. ఆకులో ఆహారాన్ని కలుపుకునేటపుడు ఆహారపదార్థానికి ఆకులో దాగున్న గుణాలకు మధ్య రసాయన చర్య జరిగి ఆహారానికి అమృతంతో సమానమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ ఆహారాన్ని తినడం వల్ల శరీరానికి గొప్ప దాతు శక్తి లభిస్తుంది.
చివరగా……
ఆరోగ్యపరంగానూ, ప్రకృతి సహజసిద్ద వనరుగానూ అరటి ఆకులు ఉపయోగించడం ఎంతో ఉత్తమం. కాబట్టి అరటి ఆకుల కోసం మీ పెరట్లో కాసిన్ని అరటి చెట్లు పెంచుకోండి. ఆకుల కోసం మరియు ఆరగించడానికి అరటి పండ్లు కూడా లభిస్తాయి కదా.