Health Benefits Of Barley Grains

బార్లీ లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా??

బార్లీ అనగానే ఫైబర్ అధిక స్థాయిలో ఉన్న ధాన్యంగా గుర్తుకొస్తుంది. సెలీనియం ఎంక్జైమ్, భాస్వరం, రాగి, మాంగనీస్ బార్లీ లో ఎక్కువగా దొరుకుతాయి. అందువలన జీర్ణకోశానికి, గుండెకు, రక్తనాళాలకు ఎక్కువ బలాన్ని కలిగిస్తుంది.  రక్తపోటు, గుండెజబ్బులు, పేగు పూత అల్సర్లు వంటి సమస్యలు ఉన్నవారు బార్లీ ని ఔషధంగా వాడితే గొప్ప ఫలితం ఉంటుంది.

బార్లీ తీసుకోవడం వల్ల పేగులు ఎప్పటికప్పుడు శుద్ధి అవుతాయి లెగ్ సంబంధ దోషాలు,  సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అలాగే పేగు సమస్య ఉన్నా బార్లీ తీసుకుంటే మెల్లిగా తగ్గిపోతాయి. పేగులలో వచ్చే కోలాన్ కాన్సర్ కు,  మొలలు వ్యాధికి, ఎసిడిటీ, బ్యాడ్ ట్రబుల్ వంటి వాటికి బార్లీ ఉత్తమ ఎంపిక. శరీరానికి ఉపయోగపడే మంచి బాక్టీరియా అభివృద్ధి చెందడానికి బార్లీ లోని డైటరీ ఫైబర్ ప్రోత్సహిస్తుంది. అందుకే అమీబియాస్ వ్యాధిలో మరియు “ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్” లాంటి వ్యాధులలో బార్లీని తరచూ తీసుకొంటూ ఉండాలి.

మన కడుపులో ఉత్పత్తి అయ్యే బుటిరిక్ ఆమ్లం పెద్దపేగు లోపల కణాల్ని బలసమ్పన్నం చేస్తుంది. దీనివల్ల పేగు కాన్సర్ దరిచేరదు.  అలాగే ప్రొఫియోనిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ లు తయారవడంలో కూడా బార్లీ తోడ్పడుతుంది. శరీరంలో కండరాలను దృడంగా ఉంచేందుకు ఈ యాసిడ్ లు దోహదం చేస్తాయి. కామెర్లు, కండరాల వ్యాదులతో ఇబ్బది పడుతున్న వారు బార్లీని తీసుకోవడం ఉత్తమం.

ప్రొఫియోనిక్ యాసిడ్ అనేది ఫాటీ యాసిడ్, ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడం లో బాగా ఉపయోగపడుతుంది. లివర్ లో తయారయ్యే కొలెస్ట్రాల్  రిడక్టేజ్ ఎంజైమ్ వల్ల జరిగే ప్రక్రియ. బార్లీ  ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రొఫియోనిక్ యాసిడ్ ఈ ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది.

బార్లీలో ఉండే ఫైబర్ లో బీటా గ్లూకోన్ అనే పదార్థం ఉంటుంది. ఇది లివర్ లో తయారయ్యే బైల్ ని కంట్రోల్ చేసి సుఖ విరేచనం ద్వారా బయటకు పంపుతుంది. మనం తీసుకున్న ఆహారపదార్థం లోని కొవ్వులను అరిగించడానికి బైల్ పదార్థమే ముఖ్య కారణం.  ఫైబర్ లో కరిగేవి, కరగనివి అని రెండు రకాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో తోడ్పడతాయి.

షుగర్ ఉన్నవారు బార్లీ గింజలతో జావ  కాచి అందులో పెరుగు కలిపి బాగా చిలికి పలుచని మజ్జిగలా తయారుచేసుకుని  తాగుతుంటే, షుగర్ ద్వారా కలిగే అరికాళ్ళ, అరచేతుల మంటలు, కండరాల నొప్పులు, మలబద్దకం, గ్యాస్ ట్రబుల్ తగ్గుతాయి.

బార్లీలో నియాసిన్ అనే బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచడం, నరాలజబ్బులు వంటి వాటిని తగ్గిస్తుంది. రక్తనాళాలు లోపల రక్తం గడ్డకట్టుకుని రక్త ప్రవాహానికి  అవరోధం ఎర్లాడే పరిస్థితి రాకుండా చేయడానికి నియాసిన్ ఉపయోగపడుతుంది. 

చివరగా….

బార్లీని తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే పై సమస్యలు అన్ని నయమవడమే కాకుండా మునుపటి ఆరోగ్యం వైపు అడుగులు కచ్చితంగా పడతాయి.

Leave a Comment

error: Content is protected !!