health benefits of brown chana chickpea

మాంసం కంటే 10 రేట్లు ఎక్కువ శక్తినిచ్చే వీటి గురించి, ఈ నిజం తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు, తప్పక

పేదవాళ్ళు దేవుడి ప్రసాదంగా పేరొందిన శనగలు ఆరోగ్య రక్షణలో కూడా ముందే ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండే శనగలలో శరీరానికి మేలుచేసే  అనేక పోషకాలు ఉంటాయి. అవేంటో వాటివలన శరీరానికి చేకూరే లాభమేమిటో ఓసారి చూసేద్దాం రండి. ఈ శనగలను పొట్టుతీయకుండా  రోజూ తినడంవలన చాలా ప్రయోజనాలే ఉంటాయి.  నానబెట్టిన శనగలను రోజూ ఉదయం  గుప్పెడు తీసుకుంటే దానిలో ఎక్కువగా ఉండే ఫైబర్ కంటెంట్ వలన ఆహారం బాగా జీర్ణమయి ఉదర సంబంధ వ్యాధులను దూరంచేస్తుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

ఈ  శనగలను అల్పాహారంగా తీసుకోవడం  వలన శరీరంలోని చెడుకొవ్వును కరిగించి మంచికొవ్వును పెరిగేలా చేస్తుంది. ఇందులో ఉండే ఆల్ఫాలినాలోనిక్  ఆసిడ్ మరియు ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధికబరువును తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సన్నబడాలి అనుకునేవారికి శనగలు మంచి ఆహారం. చాలా సేపు కడుపు నిండుగా ఉండేలా చేసి ఆకలిని తగ్గిస్తాయి. వెజిటేరియన్స్కి శనగలు ప్రోటీన్ లోపం లేకుండా చేస్తాయి. మాంసాహారంలో లభించే ప్రొటీన్లకు రెట్టింపు ప్రొటీన్లు శనగలలో దొరుకుతాయి. 

శనగలలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. పాలు, పాలసంబంధ పదార్థాలు తినని వారి శరీరానికి కావలసిన కాల్షియం శనగలనుండి లభిస్తుంది. నీరసంగా, బలంలేకుండా ఉండే పిల్లలకు శనగలు ఆహారంలో భాగం చేస్తే కాల్షియం లభించి ఎముకలు బలంగా తయారవుతాయి. శనగలను క్రమంతప్పకుండా తింటుంటే బి.పీని కంట్రోల్ చేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు శనగలను తీసుకుంటే ఐరన్ లభించి రక్తశాతాన్ని పెంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరిచి ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచుతాయి. 

పచ్చిశనగలను తినడం కష్టంగా ఉంటే ఉడకపెట్టి తిన్నా బాగుంటుంది. శనగలవలన మానసిక ఆందోళనలు, ఒత్తిడి, కోపం తగ్గుతాయి. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఇందులో దొరికే ఐరన్, ప్రొటీన్లు, మినరల్స్ శరీరాన్ని కావలసిన శక్తిని అందిస్తాయి. రోజూ తినడం వలన చురుకుగా కూడా మారతారు. కిడ్ని సమస్యలు ఉన్నవారికి శనగలు చాలా ప్రయోజనకారి.  వీటిలో ఉండే ఫాస్పరస్ శరీరంలో అధికంగా ఉన్న  అయోడిన్ను తగ్గించి కిడ్నీలపై భారం తగ్గిస్తాయి.  కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీర్యకణాల వృద్ధిని పెంచి సంతానలేమి సమస్యను తగ్గిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్న శనగలను రోజూ తీసుకుంటుంటే డాక్టర్ను కలిసే అవసరం లేకుండాపోతుంది. మరింకెందుకు ఆలస్యం శనగలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుందాం.

Leave a Comment

error: Content is protected !!