health benefits of coconut oil for hair growth

కొబ్బరి నూనెలో వీటిని కలిపి వాడండి ఎంత పల్చబడిన జట్టైనా సరే ఒత్తుగా పెరిగేలా చేస్తుంది

ప్రస్తుతం అందరిని ఎక్కువగా బాధిస్తున్న సమస్య జుట్టురాలడం. దీనికి అనేక ముఖ్యమైన కారణాలు  మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు, మానసిక ఒత్తిడి. జుట్టు రాలడం  తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా నాచురల్ ఇంగ్రీడైన్ట్స్ తో  జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.  

      దీని కోసం మనం ముందుగా ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకోవాలి.  కొబ్బరి నూనె స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా అవ్వనివ్వాలి. తర్వాత అప్పుడే వచ్చిన కలబంద మంటలు సన్నగా ఉన్న వాటిని తీసుకుని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. వాటిని అంచులను కట్ చేసి ముక్కలుగా కట్ చేసి నూనెలో వేసుకోవాలి. తర్వాత రెండు లేదా మూడు రెమ్మలు వేపాకును కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి నూనెలో వేసుకోవాలి. 

      తర్వాత దీనిలో నాలుగు ఉల్లిపాయలు పొట్టు  తీసుకొని వేసుకోవాలి.  నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె చల్లారిన తరువాత ఏదైనా పలుచటి క్లోత్ లో  వేసి వడగట్టుకుని గాజు సీసాలో పెట్టి స్టోర్  చేసుకోవచ్చు. ఇది 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. కొబ్బరినూనె బదులుగా  ఆవనూనె, క్యాస్ట్రాయల్,  బాదం ఆయిల్ దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. కలబంద జుట్టు రాలడం తగ్గించి  కొత్త జుట్టు రావడంలో  సహాయపడుతుంది. 

   కలబంద వద్దనుకున్నవారు మెంతులను ఉపయోగించుకోవచ్చు.  వేపాకు తలలో ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గేలా చేయడంలో,  చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ పొట్టు సల్ఫర్ అధికంగా కలిగి ఉంటుంది. ఇది జుట్టు రాలడం తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నూనెను రాసుకున్న ప్రతిసారీ  డబుల్ బాయిలర్ పద్ధతిలో వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తల  కుదుళ్ళు నుండి చివరి వరకు అప్లై చేసుకోవాలి. 

       అప్లై చేసిన తర్వాత ఐదు నుండి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. రాత్రి అప్లై చేసి ఉదయం తల స్నానం చేయాలి. లేదా డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను నేను వస్తా ఒక వారం లేదా పది రోజులు ఉపయోగించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!