health benefits of cooking with coconut oil

వంటల్లో కొబ్బరి నూనె వాడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా….

వారంలో మూడు సార్లు అయినా జుట్టుకు చక్కగా నూనె పెట్టుకోవడం మనకు అలవాటు. జుట్టు పొడిబారకుండా, మృదువుగా వుంటూ, ఆరోగ్యంగా పెరగడానికి అందరూ వాడేది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె లేని ఇళ్లంటూ ఉండదు. 

కొబ్బరి కోరు వేసి తాలింపు పెడితే దాని రుచే వేరు. పచ్చి కొబ్బరి వేసి పాయసంలో జోడించినా, ఎండు కొబ్బరితో కారం పొడి చేసినా, కూరల్లో కొబ్బరి పొడి జల్లినా, బిస్కెట్లు, ఐస్ క్రీమ్ లలో భాగం చేసినా కొబ్బరి రుచి అద్భుతః. కొబ్బరి, కొబ్బరి నూనె మన జీవితంలో ఇంతగా బాగమైపోయాయి. అయితే అందరికి కొబ్బరి నూనె అనగానే జుట్టుకు పెట్టుకోవడమే గుర్తొస్తుంది కానీ కేరళ ప్రాంతపు ప్రజలు రోజువారీ ఆహారంలో వంటనూనెగా కొబ్బరి నూనె ను ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయని మనకు తెలియదు. అందుకే వాటిని మీతో చెప్పడమే ఈ వ్యాసం.

◆కొబ్బరి నూనెలో 90% అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.  ఇందులో లారిక్ ఆమ్లం 40% ఉంటుంది. ఈ లారిక్ ఆమ్లం ఉండటం వల్ల మిగతా నూనెలు వేడి చేయగానే ఆక్సీకరణ కు గురైనట్టు కొబ్బరి నూనె అవ్వదు మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్ కొబ్బరి నూనెలో పుష్కలంగా ఉంటుంది. 

◆కొబ్బరి నూనె వంటల్లో వాడుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి దోహదం చేసి మంచి కొవ్వుల స్థాయి పెంచుతుంది

◆చాలామందిలో అధిక ఆకలి అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది.  ఇలాంటి వారు కొబ్బరి నూనె ను వంటల్లో ఉపయోగించడం వల్ల ఆకలిని తగ్గించి ఫలితంగా అధిక బరువును కూడా నియంత్రిస్తుంది. 

◆ఈ నూనెను రోజువారీ వాడేవారిలో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా జబ్బులకు లోనయ్యే అవకాశాలు చాలా తక్కువ.

◆ఎవరికి తెలియని మరొక నిజం. కొబ్బరి నూనె యాంటి ఏజింగ్ గా పనిచేస్తుంది.  కొబ్బరి నూనె వాడేవారిలో వయసు రీత్యా సంభవించే చర్మం ముడతలు పడటం అనే సమస్య ఉండదు. చర్మం యవ్వనంగా మృదువుగా ఉంటుంది.

◆శ్వాస క్రియా సామర్త్యాన్ని పెంచడంలో కొబ్బరి నూనె సమర్థవంతంగా పనిచేస్తుంది.  ఊపిరితిత్తుల వాపు అనే సమస్యతో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.  ఊపురితిత్తుల వాపు, శ్వాశకోశ సమస్యలు సులువుగా తగ్గించే గుణం కొబ్బరి నూనెలో ఉంది.

◆కొబ్బరి నూనె శరీరాన్ని డీహైడ్రేట్  అవ్వకుండా చేస్తుంది.  దీనివల్ల శరీరంలో వేడి సమతుల్యతలో ఉంటుంది.  చర్మాన్ని పొడి బారకుండా, మృదువుగా ఉంచుతుంది. 

చివరగా…..

కొబ్బరి నూనె మిగిలిన వంట నూనెల్లా కాకుండా తొందరగా జీర్ణమవుతుంది, మరియు శరీరాన్ని తేలిగ్గా ఉంచుతుంది. ఇపుడర్థమైందా కేవలం జుట్టుకు మాత్రమే పరిమితం చేసిన కొబ్బరి నూనె వంటలో వాడితే ఆరోగ్యంలో గొప్ప వండర్ చేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!