Health Benefits of Curd

పెరుగు గూర్చి నిజాలు, పెరుగన్నం వల్ల లాభాలు మరియు నష్టాలు.

మన హిందూ సంప్రదాయంలో పెరుగు వేసుకోకుండా భోజనం సంపూర్ణం కాదని అందరి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని పక్కన ఉంచితే పెరుగు శరీరానికి చేసే మేలును దృష్టిలో ఉంచుకుని అయినా సరే పెరుగును భోజనంలో భాగం చేసుకుంటూ ఉంటాం.

◆అయితే పెరుగు కాసింత పుల్లని రుచి కలిగి ఉంటుంది కాబట్టి కాస్త ఆలస్యంగా జీర్ణమవుతుంది. అందికే పెరుగును ఎక్కువగా తినకూడదని అంటారు. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఒంటికి నీరు పట్టిన వాళ్లకు, కఫ రోగం ఉన్నవాళ్లకు అజీర్ణ సమస్యతో బాధపడుతున్న వారికి పెరుగు మంచి చేస్తుంది. మూత్ర వ్యాధుల్ని పోగొడుతుంది, మరియు దగ్గు, జలుబు, ఆయాసం వంటి వాటికి పెరుగు మేలు చేస్తుంది. శరీరంలో విష లక్షణాలు తగ్గిస్తుంది. చలి జ్వరాలకు చాలా మంచిది.

◆పులిసిన పెరుగు అనారోగ్యాన్ని కలుగజేస్తుంది,  ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట, బిపి  ఉన్నవారు పుల్లని పెరుగు లేదా పుల్ల మజ్జిగ వాడకుండా ఉండటం ఉత్తమం. 

◆అయితే పెరుగును విడిగా కాకుండా  అన్నంతో కలిపి పెరుగన్నంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు మరియు పెరుగన్నం వల్ల వచ్చే సమస్యలు కూడా ఉన్నాయ్. అవేంటో చూడాల్సిందే.

పెరుగన్నం ప్రయోజనాలు, సమస్యలు: 

◆చిక్కి శుష్కించిపోతున్న పిల్లలకు రోజూ పెరుగన్నం పెడితే నెలరోజులలో ఒళ్ళు చేస్తారు. అంతేకాదు మంచి రంగు కూడా వస్తారు.

◆రాత్రిపూట వేడి అన్నంలో పాలుపోసి తొడుపెట్టి తెల్లవారిన తరువాత తింటే ఎంతో బలకరం, ఇలా అన్నంతో సహా తొడుకున్న అన్నం శరీరానికి చలువ చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఇది గొప్ప ఔషధంగా పనిచేసి శరీరాన్ని వడదెబ్బ కొట్టకుండా రక్షిస్తుంది.

◆బాగా ఆకలిగా అనిపించడం, ఎంత తిన్నా తిననట్టు ఉండటం వంటి లక్షణాలు కనిపించినపుడు ఉదయాన్నే పెరుగన్నం తింటే ఆకలి సమతాస్థితికి వస్తుంది. బలహీనంగా ఉన్నవారికి బలం కూడా.

◆అయితే పెరుగన్నం ఎక్కువగా తింటే మలబద్దకం చేస్తుంది. వాతాన్ని కలుగజేస్తుంది, అన్నంలో పెరుగు వేసుకుని తింటే సమస్యలు ఉండవచ్చు, అదే అన్నంలో పాలు వేసి తొడుపెట్టుకున్న పద్ధతిలో అయితే చాలా మంచి గుణాలు ఉంటాయి.

◆మజ్జిగ మరియు పెరుగు రెండు కూడా దగ్గు,జలుబు ఆయాసం వంటి ఎలర్జీ ఉన్నవారు తీసుకోకపోవడం ఉత్తమం. 

◆అయితే మజ్జిగ లేదా పెరుగు లేకుండా చేసే భోజనం తృప్తి లేకుండా అసంపూర్తిగా అనిపించడం సహజం. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మజ్జిగ తినని వారిలో చిన్నతనంలోనే జీర్ణాశయంలో పేగుల శక్తి బలహీనపడి గ్యాస్ ట్రబుల్ సమస్య వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. 

చివరగా……..

పైన చెప్పుకున్న పెరుగు లేదా మజ్జిగ మరియు పెరుగన్నం లేదా మజ్జిగ అన్నం ను అతిగా తీసుకోకుండా అలాగని అసలు తీసుకోకుండా ఉండటం అనే రెండిటి వల్ల కూడా ఆరోగ్యానికి కొద్ధో గొప్పో సమస్యలు ఉందనే ఉన్నాయి. కాబట్టి మితమే హితమని నమ్మి పరిమితంగా తీసుకోండి.

Leave a Comment

error: Content is protected !!