డ్రాగన్ పండు ఈమధ్య కాస్త విస్తరించి ఓ మోస్తరు పట్టణాల్లో కూడా అందుబాటులో ఉంది. పైకి గులాబీ రంగులో ఉంటూ లోపలి గుజ్జు నల్లని విత్తనాలతో కూడిన తెల్లని గుజ్జుతో రుచికరంగా ఉండే పండు ఇది. ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటి అంటే ఇదిగో ఇవే చదవండి.
పోషకాలు అధికంగా ఉంటాయి
డ్రాగన్ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇందులో ఫైబర్ గణనీయమైన మొత్తంలో ఉంటుంది. కేలరీలు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఇనుము, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ మొదలైన పోషకాలతో పాటు పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు మరియు బీటాసైనిన్స్ ను కూడా కలిగి ఉంటుంది.
దీర్ఘకాలిక వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుంది
శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉండటం వల్ల జబ్బులను తొందరగా కలుగజేస్తాయి. వీటిని ఎదుర్కోవటానికి డ్రాగన్ ఫ్రూట్ మంచి పరిష్కారం. డ్రాగన్ ఫ్రూట్ లో సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను నిర్మూలించడం ద్వారా జబ్బులను నయం చేస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ మరియు ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, బెటాలైన్స్, కెరోటినాయిడ్స్, ఉంటాయి. ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి.
ఫైబర్ అధికంగా ఉంటుంది
జీర్ణక్రియలో ఫైబర్ పాత్ర ప్రసిద్ది చెందినది. ఇది గుండె జబ్బుల నుండి రక్షించడం, టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడం మరియు శరీర బరువును సమస్తితిలో ఉంచడం లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది పరిశోధన సూచించింది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం పెద్దప్రేగు క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.
పరిమిత సీరీలు
మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది
డ్రాగన్ పండ్లలోని విటమిన్ సి మరియు కెరోటినాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు మీ తెల్ల రక్త కణాలను దెబ్బతినకుండా కాపాడటం ద్వారా అంటువ్యాధులు తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థలోని తెల్ల రక్త కణాలు హానికరమైన పదార్థాలపై దాడి చేసి నాశనం చేస్తాయి.
ఐరన్ ను పుష్కలంగా అందిస్తుంది
శరీరంలో ఆక్సిజన్‌ను రవాణా చేయడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని శక్తిగా విడదీయడంలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది చాలామందిలో ఐరన్ లోపం పెద్ద సమస్యగా మారుతుంది. ప్రపంచ జనాభాలో 30% ఐరన్ లోపం ఉందని అంచనా. అయితే డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకోవడం వల్ల ఐరన్ ను భర్తీ చేయవచ్చు.
మెగ్నీషియం సమృద్ధిగా కలిగి ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్ అన్నిరకాల పండ్లకంటే కూడా ఎక్కువ మెగ్నీషియంను అందిస్తుంది, మెగ్నీషియం శరీరంలో ప్రతిచర్యలలో పాల్గొంటుంది. అలాగే మెగ్నీషియం ఎముక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. మెగ్నీషియం శరీరంలో జీవరసాయన ప్రతి చర్యలకు అవసరమైన పోషకం కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ ద్వారా దీన్ని పొందవచ్చు.
చివరగా…..
డ్రాగన్ ఫ్రూట్ కొద్దిగా ఖరీదైనదే అయినా ఇది ఎంతో గొప్ప ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది కాబట్టి అందుబాటులో ఉన్నపుడు తినడం వదలకండి.