ఎండబెట్టిన అల్లాన్ని సొంటి అంటారు. అల్లం పై తొక్క తీసి సున్నపు తేట లోనుంచి ఎండబెట్టి సొంటిని తయారు చేస్తారు. ఆయుర్వేదంలో సొంటిని అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. మొదటి ముద్దగా సొంటిని అన్నంలో కలుపుకొని తింటే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడమేకాక ఆకలి పెరుగుతుంది. గోరువెచ్చని నీటిలో సొంటి పొడిని కలిపి దానిలో కొంచెం తేనె కలుపుకొని తాగుతూ ఉంటే క్రమక్రమంగా బరువు తగ్గుతారు.
జలుబు ఇబ్బంది పెడుతున్నప్పుడు సొంటి పొడి మిరియాల పొడి గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటే ముక్కు కారడం తగ్గిపోతుంది. మైగ్రేన్ తలనొప్పి బాధిస్తున్నప్పుడు సొంటి పొడి తాటి బెల్లం చేర్చి తీసుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది.
తీవ్రమైన తలనొప్పి వచ్చినప్పుడు సొంటి నీటితో కలిపి అరగదీసి ఆపేస్టుని నుదిపై లేపనంగా పూసుకున్న తలనొప్పి తగ్గిపోతుంది.

సొంటి టీ తాగడం వలన వాత పిత్త కఫ దోషాలు తగ్గిపోతాయి. సొంటి పొడి లో తేనె కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. సొంటి ధనియాలతో కషాయం తీసుకుంటే వాత సంబందమైన నొప్పులు తగ్గుతాయి.
కడుపుబ్బరం గ్యాస్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు సొంటి, వాము, సైంధవ లవణం సమభాగాలుగా తీసుకుని పొడిచేసి నిమ్మరసంలో కలిపి ఎండబెట్టి ఉండలుగా చేసుకుని ఉదయం సాయంత్రం తీసుకుంటే గ్యాస్ అజీర్తి వాంతులు నులి పురుగులు తదితర ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నప్పుడు సొంటి పొడి, బెల్లం పొడిని మిక్స్ చేసి ఆమిశ్రమాన్ని భద్రపరుచుకుని ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో అర టేబుల్ స్పూను పొడిని కలుపుకుని ఉదయం పరగడుపున సాయంత్రం 6 గంటల సమయంలో క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
చివరిగా …
అయితే సొంటి వేడి చేసే గుణం ఉన్నందున మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి మరిన్ని ఆరోగ్య కరమైన విషయాలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి
మంచి విషయం