health benefits of eating 2 cloves daily

రోజు రెండు లవంగాలు తింటే ఏమవుతుందో తెలుసా….

లవంగాలు ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. ఇవి వంటల్లోనే కాకుండా ఆరోగ్య సంరక్షణలో కూడా ప్రసిద్ధి చెందాయి. లవంగంలో ఉన్న ఔషధ గుణాల వల్ల ఎన్నో జబ్బుల నివారణలో ఇది దోహదం చేస్తుంది. కారం, ఘాటు కలిగిన ఈ లవంగాలు ప్రతిరోజు రెండు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?? అయితే ఒకసారి చూడండి. రోజు రెండు లవంగాలు తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో.

 ◆రోగనిరోధక శక్తి పెంచడంలో లవంగం గొప్పగా పనిచేస్తుంది. మనం తీసుకునే ఉత్తమమైన ఆహారాలలో లవంగం కూడా ఒకటి, వంటల్లో కూడా విరివిగా ఉపయోగించే లవంగంలో శరీరంలో తెల్ల రక్త కణాల పరిమాణాన్ని పెంచడంలో మరియు అంటువ్యాధుల నుండి పోరాడటానికి సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. 

  ◆ జీర్ణ సమస్యలకు నివారణగా లవంగాలను ఉపయోగించవచ్చు, జీర్ణాశయ సామర్త్యాన్ని బలోపేతం చేసే జీర్ణ ఎంజైమ్‌లను ఇవి గణనీయంగా పెంచుతాయి. కడుపు వికారాన్ని తగ్గిస్తాయి.  లవంగాలు ఫైబర్ తో నిండి ఉంటాయి. వీటిలోని ప్రభావవంతమైన ఫైబర్ జీర్ణాశయాన్ని సంరక్షిస్తుంది మరియు  మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.  లవంగాలతో జీర్ణ సమస్యల ను నయం చేయడానికి ఉత్తమ మార్గం వాటిని పొడి రూపంలో తేనెలో కలిపి తీసుకోవాలి.

◆ మన శరీరాన్ని బలోపేతం చేయడానికి మరియు మనం తీసుకునే మందులను జీవక్రియ చేయడానికి కాలేయం బాధ్యత వహిస్తుంది.  లవంగ నూనెలో ఉన్న యూజీనాల్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

  ◆లవంగంలో ఉండే  యూజీనాల్ తలనొప్పి నివారణగా ఉపయోగపడుతుంది.  లవంగాలు కొబ్బరి నూనెలో నానబెట్టి ఆ నూనెతో నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

 ◆ లవంగాలు ఎముక ఆరోగ్యాన్ని సంరక్షించే ఫ్లేవనాయిడ్లు, మాంగనీస్ మరియు యూజీనాల్ వంటివి కలిగి ఉంతుంది.  ఈ పదార్థాలు ఎముక సాంద్రతను పెంచుతాయి, అవి ఎముక కణజాలను ఉత్పత్తి చేయడానికి సహకరిస్తుంది. ఆరోగ్యకరమైన ఖనిజాలను ఎముకలకు రవాణా చేస్తాయి.

◆ బ్యాక్టీరియాను తొలగించడంలో లవంగా నూనె ప్రభావవంతంగా ఉంటుందని నిపుణుల  నిర్ధారణ.  టీ ట్రీ ఆయిల్, లవంగాలు మరియు తులసితో చేసిన మూలికా సహజ మౌత్ వాష్ చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు నోటిలోని బ్యాక్టీరియా తగ్గిస్తుంది.

◆ లవంగాలు పాలిఫెనాల్స్ యొక్క శక్తివంతమైన వనరు.  పాలీఫెనాల్స్ మనం ఆకుకూరలు తినేటప్పుడు గ్రహించే సూక్ష్మపోషకాలు.  అవి మన శరీరానికి గొప్ప ప్రయోజనాలను కలిగి ఉన్నాయి అవి కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గిస్తాయి, ధమనుల పనితీరు మెరుగుపరుస్తాయి మరియు దీర్ఘాయువుని పెంచుతాయి.

 ◆ డయాబెటిస్ వంటి రక్తంలో చక్కెర సమస్య ఉన్నవారికి లవంగాలు సరైనవి, ఎందుకంటే అవి శరీరం లోపల ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి.  అవి రక్తంలోని  అదనపు చక్కెరను  నిర్మూలించడంలో మరియు సమతుల్యతగా ఉంచడంలో సహాయపడతాయి.

 ◆ లవంగాలలో కనిపించే యూజీనాల్ రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదిస్తుంది. దీనివల్ల మహిళల్లో  నెలసరి సమస్యలు నయమవటండంలో దోహదం చేస్తుంది.

చివరగా……

పై చెప్పుకున్న ప్రయోజనాలను చూసిన తరువాత ఇక మనం మన రోజు వారీ తప్పక రెండు లవంగాలు తినడం మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటాం. నిజమా కాదా చెప్పండి. సహజ పద్దతిలో ఆరోగ్యం పొందడం ఆనందమేగా..

Leave a Comment

error: Content is protected !!