health-benefits-of-eating-paan-after-food

తాంబూలం తింటున్నారా ఒక్కసారి ఈ నిజం తెలుసుకోండి.

అతిథి దేవోభవ అంటుంది మన సంస్కృతి. ఎవరు ఇంటికి వచ్చిన భోజనం పెట్టాలనేది మన పద్దతి.  ఒకప్పుడు భోజనం అవ్వగానే తాంబూలం ఇవ్వడం పద్దతిలో భాగం. ఇపుడు పెళ్లిళ్లు లాంటి సందర్బాలలో మాత్రమే కనిపించే ఈ అలవాటు ఒకప్పుడు భోజనం తరువాత తప్పనిసరిగా ఉండేది.

గమనించే ఉంటాం మన బామ్మలు, తాతలు వయసునిండిన పెద్దలు చేతిలో చిన్నపాటి రోలు అందులో ఆకు వక్క వేసి బాగా దంచి అందులో కాసింత సున్నమేసి నములుతూ ఉండేవారు. పళ్ళు లేకపోయినా వాళ్లకు అదొక అలవాటు. ఆయుర్వేదం తాంబూల సేవనం గొప్పదని చెబుతుంది. అసలు తాంబూలం అంటే ఏమిటి, బయట దొరుకుతున్న కిల్లి లు, తాంబూలం రెండూ ఒకటేనా తాంబూలం వల్ల ప్రయోజనం ఏమిటి?? మీకోసమే చదవండి.

ఆకు, వక్క సున్నం తరచుగా అందరూ తినేది. తమలపాకు లో ఉన్న ఆరోగ్య రహస్యాలు మనకు తెలిసినవే, అయితే నిజమైన తాంబూలం అంటే ఆకులోకి వక్క, సున్నం తో పాటు కాసింత జాజికాయ, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, కస్తూరి మొదలైనవి వాడతారు. ఇవన్నీ ఆయుర్వేదపరంగా ఆరోగ్యాన్ని చేకూర్చేవి. 

తాంబూలం వల్ల ఎముకలను దృడంగా ఉంచడానికి ఉపయోగపడే కాల్షియం విటమిన్-ఎ, విటమిన్-సి, ఫోలిక్ యాసిన్ వంటివి సమృద్ధిగా మన శరీరానికి అందుతాయి. తాంబూలం వల్ల జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా ఉంటుంది. తాంబూలం తీసుకోవడం వెనుక ముఖ్యకారణం ఇదే. అయితే కాలం గడిచేకొద్దీ తాంబూలం అనేది కూడా వెనకబడిపోతోంది. కారణం ఏదైనా కావచ్చు. అయితే దీనిని కొత్తగా తీసుకువచ్చారు పాన్ లేదా కిళ్ళీ అనే రూపంలో. 

పాన్ లేదా కిల్లి లను తాంబూలమనే చాలామంది అనుకుంటారు అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం పాన్ తయారీలో ఆకు వక్క సున్నం కాకుండా వాడే ఇతర పదార్థాలు కృత్రిమ రంగులు, కృత్రిమ సువాసనలు జతచేసి చూడటానికి కళాత్మకంగా చేసినా ఆరోగ్యానికి అంత మంచిది కాదనే చెప్పవచ్చు.

స్వీట్ పాన్, డ్రై ఫ్రూట్ పాన్, చాక్లెట్ పాన్ అంటూ రకాలు తీసుకువచ్చిన మన సంప్రదాయమైన తాంబూలం ఇచ్చిన పలితాలను మాత్రం ఇవ్వలేవు.  అయితే చాలా మంది తాంబూలం వేసుకోవడం చిన్న తనంగా అదేదో తప్పు చర్యగా చూస్తారు. ముఖ్యంగా పాశ్చాత్యులు తాంబూల సేవనాన్ని డర్టీ హాబిట్ గా ముద్ర వేశారు. అందులో గల ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే ఎవరూ వధులుకోరు మరి

చివరగా……..

పెద్దలు ఏది ఊరికే చేయరు, మరియు చెప్పరు. భోజనం తరువాత మనం తిన్న ఆహారం పళ్లలో ఇరుక్కుని ఉంటుంది. అది బయటకు వచ్చేసి దంతాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తాంబూలం లో వాడే ప్రతి పదార్థం జీర్ణక్రియను సమర్థవంతంగా మరియు కాలేయం, ఊపిరితిత్తులకు రక్షణ ఇచ్చి వాటిని ఆరోగ్యంగా ఉండేలా చేసేవే.  కాబట్టి ఇప్పటి వేగవంతమైన బిజీ లైఫ్ లో  ఆఫీస్ లు వంటి చోట్ల అంటే కుదరదు కానీ కనీసం ఇంటి పట్టున ఉన్నపుడు అయినా తాంబూలం వేసుకోండి మరి. 

Leave a Comment

error: Content is protected !!