health benefits of eggs

ఉడకబెట్టిన కోడిగుడ్డు తింటున్నారా? వరుసగా 3 రోజులు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యపోతా

ప్రాచీన కాలం నుండి గుడ్లు ఆహారంలో ప్రధానమైనవి  మరియు భోజనంలో అవి నిరంతరం ఉండటానికి మంచి కారణం ఉంది.  ఉడికించిన గుడ్లు, ఆమ్లెట్స్ మరియు అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తుంటాం. గుడ్లు  ప్రోటీన్, కాల్షియం మరియు అనేక విటమిన్లు మరియు పోషకాలకు మూలం. ముఖ్యంగా గుడ్లు ఉడికించి తీసుకోవడంవలన ఎక్కువగా ప్రోటీన్లు దొరుకుతాయి. కనీసం పదమూడు నిమిషాలు ఉడికించాలి. ఉడికించిన వెంటనే తినేయాలి. లేదంటే గుడ్డుపై బాక్టీరియా త్వరగా పెరిగుతుంది. మీ ఆహారంలో గుడ్లు చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.మరింత సమాచారం కోసం క్రింది వీడియో చూడండి.

పరిమాణంలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ, గుడ్లు చాలా పోషణను కలిగి సమతుల్య ఆహారంలో ముఖ్యమైన ఆహారంగా ఉంటాయి. శాచ్యురేటెడ్ కొవ్వులు, పొటాషియం, విటమిన్ ఎ మరియు విటమిన్ డి, విటమిన్ బి 6, బి 12, విటమిన్ డి కి ప్రధాన పోషకాలు. ఒక పెద్ద ఉడికించిన గుడ్డులో 77 కేలరీలు ఉంటాయి. రోజుకు ఒక కోడిగుడ్డు తినవచ్చు. పచ్చసొనతో పాటు తినడం వలన పూర్తి లాభాలను పొందవచ్చు. మధుమేహం ఉన్నవారు వారానికి రెండు తినవచ్చు. రోజూ రెండు కోడిగుడ్లు తింటే మీ హెచ్డీఎల్ లెవల్ పదిశాతం పెరుగుతుంది. దీనివలన గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది. 

శరీరంలో కణాల తయారీకి కొవ్వు అవసరం .కొవ్వును తయారు చేయడానికి కూడా గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్లు కాన్సర్ కణాలతో పోరాడతాయని అనేక ప్రయోగాలలో నిరూపించారు. ఇందులో ఉండే ప్రొటీన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక బరువు తగ్గడానికి, కండరాలు బలపడడానికి, కంటి ఆరోగ్యం మెరుగుపడడానికి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ప్రతిరోజూ ఉడికించిన గుడ్డు తినేవారిలో కంటిలో శుక్లాలు వచ్చే అవకాశం తక్కువ. గోళ్ళ ఆరోగ్యానికి గుడ్డు ఉపయోగపడుతుంది.

 గుడ్డులో 300గ్రాముల కోలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి సంకేతాలను పంపించే నాడీవ్యవస్థను అద్బుతంగా పనిచేసేలా చేస్తుంది. ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. బ్రెస్ట్ కాన్సర్ ను నిరోధిస్తుంది. ఎనీమియాతో బాధపడేవారికి గుడ్డు మంచి పోషకాహరం. గుడ్డులో ఉండే ఐరన్ని శరీరం త్వరగా గ్రహిస్తుంది. గర్బవతులు, బాలింతలకు తేలికగా జీర్ణమవుతుంది. గుడ్డులో జింక్ పుష్కలంగా ఉంటుంది. గుడ్లు తినడం వలన జుట్టు కూడా ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. కోడిగుడ్లు తినడం వలన తక్షణమే శక్తి లభిస్తుంది. నీరసంగా ఉండే పిల్లలకు రోజుకు ఒక గుడ్డు పెట్టడంవలన బలంగా, ఆరోగ్యంగా తయారవుతారు.

Leave a Comment

error: Content is protected !!