health benefits of groundnuts

ఈ మూడు వ్యాధులు ఉన్నవారు వేరు శనగ లు తింటే ప్రాణాలకే ప్రమాదం

చాలామంది వేరుశనగలను టైం పాస్ కోసం స్నాక్ గా తింటూ ఉంటారు. అలాగే ఇవి బాదంపప్పులకు సరిపడా లాభాలను కలిగి ఉంటాయి. అందుకే ఇవి పేదవాడి బాదంగా చెప్పబడుతున్నాయి. వీటిని ప్రతి రోజూ ఒక గుప్పెడు  నానబెట్టి లేదా వేయించి, ఉడకబెట్టి తినడం వలన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు  పల్లీలను తినడం వలన కొందరిలో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే ఎవరు వేరుశనగలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

వేరుశెనగలు ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు మరియు ఫైబర్ యొక్క మంచి మూలం.  

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బులను నిరోధించడంలో కూడా వేరుశెనగ సహాయపడుతుంది.  అవి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని కూడా ఆపగలవు మరియు గుండెపోటు లేదా బ్రెయిన్  స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  చాలా ప్రోటీన్ కలిగిన ఆహారాలు మరియు తక్కువ కేలరీలతో కడుపు నిండిన అనుభూతిని పొందడంలో మీకు సహాయపడతాయి. ఎముకలు బలపడటానికి, క్యాన్సర్ కణాలతో పోరాడటానికి వేరుశనగ చాలా బాగా సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి కూడా దోహదపడుతుంది. అయితే వేరుశనగను కొంతమంది తీసుకోకూడదు. ఎవరు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

 వేరుశెనగ తినడం వలన మీ చర్మంపై ఎలర్జీ, దురద, దద్దుర్లు, చర్మంపై వాపు వంటి సమస్యలు రావచ్చు. వేరుశనగ చాలా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. దీని వలన కడుపులో, ఛాతిలో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే ఎసిడిటీ  సమస్య ఉన్నవారు వేరుశనగలు  తీసుకోకపోవడం మంచిది. కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా వేరుశెనగ  తీసుకోకూడదు. దీని నుండి విడుదలయ్యే ఒక రకమైన రసాయనం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. పల్లీలు తిన్న వెంటనే నీటిని తాగకూడదు అని అంటారు. ఇలా తాగడం వలన జీర్ణ సమస్యలు మరియు జలుబు చేసే అవకాశం ఉంది

అలాగే పల్లీలులో ఉండి నూనె  ప్రేగులకు అంటుకుపోయి కొవ్వులా మారుతుంది. ఇది అధిక బరువు సమస్యకు కారణం అవుతుంది. అంతేకాకుండా పల్లీలలో ఉండే నూనె జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీని వల్ల జీర్ణ సంబంధ సమస్య ఏర్పడుతుంది.. అలాగే వేరుశనగలు తింటే వెంటనే నీటిని తాగడం వలన నోటి దుర్వాసన సమస్య కూడా ఏర్పడుతుంది. అందుకే పల్లీలను తక్కువగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఈ సూచనలను తప్పకుండా పాటించాలి. అలర్జీ సమస్య ఉన్నవారు వీలైనంతగా వేరుశనగలకు దూరంగా ఉండటం మంచిది.

Leave a Comment

error: Content is protected !!