health benefits of growing beard

గడ్డంతో ఇన్ని లాభాలా?

ప్రస్తుత సమాజంలో, అబ్బాయిలకు గడ్డం యొక్క పెరుగుదలకు, దాని నిర్వాహణకు నిజమైన అర్ధం తెలియదు. ప్రస్తుతం ఫ్యాషన్ లో ఉన్నా.. లేక వారి ధోరణి బట్టి చాల మంది గడ్డం పెంచుతున్నారు.

నేటి తరం సెలబ్రిటీ లు.. అంటే సినిమా వారే కావొచ్చు, లేదా క్రీడా రంగంలో వారైన ఉండొచ్చు.. వీళ్ళు గడ్డం పెంచుకుంటే.. సమాజంలో యువత కూడా వారిని గుడ్డిగా ఫాలో అవుతున్నారు. అయితే గడ్డం యొక్క అధ్బుతమైన ఆరోగ్య ప్రయోజానాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు.

గడ్డం అబ్బాయిలకు అనేక ప్రయోజనాలతో పాటుగా వారి అందాన్ని పెంచుతుంది. గడ్డం ఉంటే చర్మానికి మంచి మాయిశ్చరైజ్ కలిగి ఉండి, యంగ్ గా… స్మార్ట్ గా కూడా కనిపిస్తారు.

చర్మ వ్యాధులు

గడ్డం పెంచుకోవడం వలన అనేక చర్మ సంబందిత వ్యాధులు నుంచి దూరం కావొచ్చని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇదెలా అంటే, సూర్యుడి నుంచి విడుదలయ్యే రేడియేషన్ కిరణాలు నేరుగా ముఖంపై పడవని, దీని వల్ల చర్మం నల్లగా మారడం, ముడతలు, కమిలిపోవడం వంటి సమస్యలు రావని అంటున్నారు.

మొటిమలు

గడ్డం ని క్లీన్ గా షేవ్ చేసుకున్న ప్రతిసారి, చర్మం మాయిశ్చరైజేషన్ కోల్పోతుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇక బ్యాక్తీరియాతో ఇన్ఫెక్షన్లు, మొటిమలు వస్తాయి. మరి గడ్డం ఉంటె ఈ సమస్యలు రావు, అలానే ముఖంపైన వచ్చే మచ్చలు కూడా చాలవరకు తగ్గిపోతాయి.

కాన్సర్ నుంచి రక్షణ

గడ్డం వెంట్రుకలు సూర్యుని యొక్క యూవీ కిరానాలను 95 శాతం నిరోధిస్తుంది. సున్నితమైన ముఖ చర్మం మీద సూర్య కిరణాలు పడకుండా నిరోధించడమే కాక, గడ్డం ,చర్మ క్యాన్సర్ నుండి కూడా రక్షణను ఇస్తుంది.

ఆస్తమా, ఇన్ఫెక్షన్స్ నివారణ

ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్స్ కి అనేక కారణాలలో బ్యాక్టీరియా ఒకటి.. అయితే ఈ బ్యాక్టీరియా, టాక్సిన్స్ లోపలికి వెళ్ళకుండా గడ్డం నిరోధిస్తుంది.

శీతాకాలంలో గడ్డంతో వెచ్చదనం

శీతాకాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో గడ్డం ఎంతో తోడ్పడుతుంది. చలి పెరిగేకొద్దీ, గాలికి గురయ్యే చర్మం మరింత చల్లగా మారుతుంది. అయితే గడ్డం ఉండటం కారణంగా ఈ బాగం వేడెక్కి , రక్షణగా ఉంటుంది. ఒక విధంగా గడ్డం చర్మానికి ఒక సేఫ్టీ కవర్.

గడ్డం… అప్పట్లో  దేవాదాసులు…ఇప్పట్లో ప్రేమదాసులు..

ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు, గడ్డంతో ఉండే అబ్బాయిలనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు ప్రేమలో విఫలమైన వారే గడ్డాలు పెంచి దేవదాసులైతే… ఇప్పుడు మాత్రం ప్రేమకి దాసులు కావాలంటే గడ్డం పెంచాల్సిందే.

Leave a Comment

error: Content is protected !!