health benefits of guava leaves

అమ్మాయిలు తప్పకుండా ఈ వీడియో చూడండి,ఖాలీ కడుపుతో జామ ఆకులను తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..

జామకాయలు అందరికీ అందుబాటులో ఉండే పండు. వీటిలో ఆరోగ్యానికి మేలుచేసే గుణాలు అధికం. జామకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిజానికి ఇది ఇంట్లో పెరిగే దివ్యౌషధం. జామాకుల్లో కూడా మనకు తెలియని ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. ఉదయం పరగడుపున మూడు జామాకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. 

పండుకంటే జామాకుల్లోనే ఔషధగుణాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. న్యూట్రియంట్స్, నొప్పులను వాపులను తగ్గించే  ఔషధగుణాలు ఈ జామాకుల్లో ఎక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు, ఊపిరి సమస్యలు, పంటినొప్పి చిగుళ్ల నొప్పులను, నోటిపూత ఇలాంటి ఎన్నో సమస్యలకు తగ్గిస్తుంది ఈ జామాకు. జామాకు మన ఇమ్యునిటిని పెంచడంలో అద్బుతంగా పనిచేస్తుంది. 

ఇందుకు కారణం జామాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచే క్వర్సిటిన్ ఫ్లెవనోల్ అనే ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. పొటాషియం, ఫైబర్  కూడా ఎక్కువే. ఇవన్నీ ఉండడంవలన ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలు దూరంచేస్తాయి. జామాకులు తిన్నా లేదా కషాయం తాగినా మంచిదే. కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఐదు లేదా పది జామాకుల్ని ఒక లీటర్ నీటిలో వేసి ఆ నీళ్ళు సగం మరిగే వరకూ ఉంచాలి. 

ఇలా మరిగిన నీటిని కనుక ఉదయాన్నే తీసుకుంటే బ్లెడ్ లో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఎంతో మేలుచేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఇలా జామాకుల టీ తాగితే షుగర్ వలన వచ్చే అన్ని సమస్యలు తొలగిపోతాయి. జామాకుల్లో యాంటి ఆక్సిడెంట్లు మన రక్తంలోని టాక్సిన్లు బయటకు పంపుతుంది. వీటిలో ఉండే పొటాషియం డైటరీ ఫైబర్ అనేది మన గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

 చెడు కొలెస్ట్రాల్ తగ్గించి బ్లాకేజ్లు తగ్గడంలో సహాయపడుతుంది. మంచి కొవ్వు పెరిగేలా చేస్తుంది. దీనివలన గుండెపోటుకు దారితీసే హైబీపిని తగ్గిస్తుంది.  ఈ జామాకులు లేదా కషాయం ఏది తీసుకున్న మంచిదే. నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పిని ఈ జామాకులు రసం తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. జామాకులు టీ ద్వారా మంచి ఫలితం ఉంటుంది. జామ పండు తినడంవలన తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. కారణం ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 

పండు కంటే కూడా జామాకుల్లో డైటరీ ఫైబర్ అధికం. దీంతో జామాకులు తిన్నా వాటి రసం తాగినా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. విరోచనాలు అవుతున్నపుడు  ఈ టీని తాగినా వెంటనే తగ్గుముఖం పడతాయి. ప్రాణాపాయం అయిన కాన్సర్ ని తగ్గించడంలోనూ, కాన్సర్ కోసం వాడే మందులవలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. 

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

Leave a Comment

error: Content is protected !!