చాలామందికి తెలియని పేరు కర్రపెండలం. చూడ్డానికి చెట్టు కొమ్మలా చెక్కు తీస్తే లోపల చిలకడ దుంపలా తెల్లగా ఉంటుంది. ఇది బంగాళదుంప, చిలకడదుంప తీరులోనే ఉడికించి వండుతారు. అలాగే వాటిలాగే కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా కలిగి ఉంటుంది. మనం విరివిగా వాడే సగ్గుబియ్యం ను కర్రపెండలం నుండే తయారుచేస్తారు. సగ్గుబియ్యం ఎలాంటి అరిగ్య ప్రయోజనాలను కలుగజేస్తుందో మనందరికి తెలిసినదే. అయితే ఈ కర్ర పెండలం కూడా అంతకు మించి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే ఇది దొరకడం చాలా అరుదు. కర్రపెండలం లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి9, సోడియం, కాల్షియం, ఒమేగా3, ఒమేగా6 ఫ్యాటీ యసిడ్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మొదలైనవి ఉంటాయి. కర్రపెండలం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూడండి మరి.
విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచదసంతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో సమృద్ధిగా ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది. కర్రపెండలం తీసుకోవడం వల్ల రోజువారీ అవసరమైన విటమిన్ సి లో 25% సులువుగా పొందవచ్చు.
యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
కర్రపెండలం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫినోలిక్ సమ్మేళనాలతో సహా యాంటీఆక్సిడెంట్లను కూడా అందిస్తుంది. ఈ ఫినోలిక్ సమ్మేళనాలు స్వల్ప మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నయం చేయడానికి యాంటీఆక్సిడెంట్లను సమర్థవంతంగా అందించడంలో సహాయపడుతుంది.
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.
పిండి పదార్ధాలు అవసరానికి మించి తీసుకోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలు తొందరగా చుట్టుముడతాయి. అయితే కేంద్ర నాడీ వ్యవస్థ మరియు కండరాలకు శక్తిని సమకూర్చేది పిండిపదార్థాలే. కర్రపెండలం గొప్ప పిండి పదార్థాల సమ్మేళనం, ఇది విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు కరగని ఫైబర్‌ను అందిస్తూ శక్తిని అందిస్తుంది, ఇది సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్‌గా మారుతుంది.
ఫైబర్ కలిగి ఉంటుంది.
కార్బోహైడ్రేట్స్ తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది అందువల్ల రక్తంలో చక్కెర నియంత్రణ, రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం మరియు పేగులు పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తుంది. .
కంటి చూపు మెరుగుపరుస్తుంది
విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తుంది, కర్రపెండలం లో ప్రొవిటమిన్ ఎ కెరోటినాయిడ్లతో బలపడి ఉంటుంది, ఇది విటమిన్ ఎ ను గ్రహించడంలో సహాయపడుతుంది. కర్రపెండలం తీసుకోవడం వల్ల విటమిన్ ఎ గణనీయంగా పెరిగి, విటమిన్ ఎ లోపం వల్ల కలిగే అన్ని సమస్యలు సులువుగా తగ్గుముఖం పడతాయి.
చివరగా…
కర్రపెండలం అనేది గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో దొరికే దుంప జాతికి చెందినది. పైన చెప్పుకున్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా సహజంగా లభించేది కావడం వల్ల శరీరానికి చాలా గొప్ప ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. కాబట్టి కర్రపెండలం లభ్యమైనప్పుడు ఆహారంలో భాగం చేసుకోవడం అస్సలు మరవకండి.