హలో ఫ్రెండ్స్.. ఈ రోజు మన కళ్ల ముందు కనిపించే ఒక చెట్టు గురించి తెలుసుకుందాం. ఈ చెట్టును విరిగి లేదా విరిగి చెట్టు విరిగి కాయలు చెట్టు, నక్కెర, బంక నక్కెర, బంక కాయలు, బంక కాయలు చెట్టు నెక్కర కాయలు అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకం పేరుతో పిలుస్తూ ఉంటారు. మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారు కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి.
ఈ నక్కెర చెట్టు అనేది బోరాగినిస్ అనే కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం కార్డియో dichotoma. దీనిని ఇంగ్లీషులో లాసోరా గంబేరి ఇండియన్ చెర్రీ అనే పేర్లతో పిలుస్తుంటారు. ఈ చెట్టు దాదాపు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. కొమ్మలు అన్ని దిశలలో వ్యాపించి కొంచెం వంగిపోయి విశాలంగా పెరుగుతూ కనిపిస్తుంది.
ఈ విరిగి చెట్లు కూడా దేశంలో రోడ్డుకు ఇరువైపులా పల్లెటూర్లలో పట్టణాలలో అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి.పల్లెటూరి వారు ఈ మొక్కను చాలా మంది చూసే ఉంటారు.. ఈ చెట్టుకు గుత్తులు గుత్తులుగా చాలా కాయలు కనిపిస్తూ ఉంటాయి. వీటి పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటాయి. పండు మగ్గిన తర్వాత లేత ఎరుపు రంగులో ఉంటాయి. వీటి కాయ లోపల బంక లాగా ఒక తీపి పదార్థం ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాలలో దీనిని బంక కాయలు చెట్టు అని కూడా పిలుస్తారు. తియ్యగా ఉండే ఈ చెట్ల పండ్లను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ పండ్లు అరగడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి తక్కువ మోతాదులో అంటే రోజుకి 5 నుంచి 6 పండ్లు మాత్రమే తీసుకోవాలి.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ విరిగి చెట్టును మన సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు యొక్క ఆకులు పండ్లు పై బెరడు విత్తనాలు ఇలా అన్నింటిలో యాంటీబయాటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్టు పండ్లు తినడం మూలంగా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చెట్టు కాయలు క్యాల్షియం కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఐరన్ పాస్పరస్ ఇంకా మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు దాగివున్నాయి. జూలై నుండి ఆగస్టు సీజన్ లో మాత్రమే దొరికే ఈ చెట్లు పండ్లను తినటం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది పల్లెటూర్లలో ఈ చెట్లకు కాసే పచ్చికాయలను పచ్చడి గా చేసుకుని తింటారు. ఇది ఒక ఔషధం లాగా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని చాలా గ్రామాలలో నమ్ముతుంటారు. పండిన కాయలు చాలా తియ్యగా రుచిగా ఉంటాయి. ఈ పండ్లు తీయగా ఉండడమే కాదు మన శరీరానికి చలువను కూడా చేస్తాయి .
ఈ పండ్లను తినడం మూలంగా మన రక్తంలోని దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ నక్కెర పండ్లు తినడం మూలంగా డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుందని ఇటీవల జరిపిన అనేక రకాల పరిశోధనలలో కూడా రుజువైంది. ఈ పండ్లు తినడం మూలంగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ అవుతుంది. మలబద్ధకం అజీర్తి గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లను రోజుకి ఐదు నుంచి ఆరు మోతాదులో తీసుకుంటే మీకు సుఖ విరోచనం అవ్వటమే కాకుండా పొట్టకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి.
ఈ చెట్టు యొక్క ఆకులను చాలా ప్రాంతాలలో కూర వండుకుని తింటూ ఉంటారు. అలాగే ఈ చెట్టు బెరడు ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు బెరడును ఎండబెట్టి పొడిచేసి ఆ పొడిని మెత్తటి పేస్ట్ లా చేసుకొని చర్మ సంబంధిత సమస్యల పైన అప్లై చేస్తూ ఉంటే మీ సమస్యలు తగ్గిపోతాయి.ఈ చెట్టు విత్తనాలు కూడా మెత్తటి పేస్ట్ లా చేసుకొని దురద ఉన్న ప్రదేశాలలో అప్లై చేస్తూ ఉంటే దురద కూడా తగ్గుతుంది.
గిరిజన ప్రాంతాల్లో లో ఈ లసొడ పండ్లను ఎండబెట్టి మైదా శెనగపిండి నెయ్యితో కలిపి లడ్డూలు లాగా తయారు చేస్తారు. లడ్డూలను తినడం వల్ల శరీరానికి బలం శక్తి లభిస్తుందని ఎన్నో ఏళ్లుగా వాళ్లు నవ్వుతున్నారు. ఈ చెట్టు యొక్క బెరడు తో మహిళలు కనుక కషాయం చేసుకుని తాగితూఉంటే మహిళకు రుతు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. అలాగే ఈ కషాయం తో గాయాలను పుండ్లను శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండి త్వరగా నయమవుతాయి.
శృంగార సామర్థ్యం కూలిపోయిన పురుషులు రోజుకి 5 నుండి డి10 మోతాదులో ఈ నక్కెర పండ్లు తింటూ ఉంటే మీ శరీరంలో లోపించిన సామర్థ్యం కూడా తిరిగి వస్తుంది. పురుషులలో వీర్య కణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. అలాగే ఈ చెట్టు బెరడు కషాయాన్ని నోట్లో పోసుకుని పూక్క లిస్తూ ఉంటే మీ దంతాలు చిగుళ్లు గట్టిగా మారటమే కాకుండా నోటిలో పూత గొంతులో శ్లేష్మం కఫం లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
ఈ చెట్టు లేతగా ఉండే ఆకులను నూరి పేస్ట్ లాగ చేసి తల పైన పడితే తల నొప్పి సమస్య కూడా తీరుతుంది. వీటి ఆకులతో తయారుచేసిన కషాయాన్ని తాగుతూ ఉంటే దగ్గు జలుబు త్వరగా తగ్గుతాయి. ఇలాంటి అద్భుతమైన మొక్క గురించి మీరు తెలుసుకున్నారు కదా మీరు తెలుసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి.
మా ఏరియా లో దిన్ని (చీమిడి) పల్లు అంటారు.
నిర్మల్ జిల్లా, తెలంగాణ.
In Nallagonda dist . Iriki fruits , it can cook as Curry which is solutions for free motion
ఇరీకాయలు అంటారు కరీం నగర్ డిస్ట్రిక్ట్ లొ….వీటి కాయలను కూర చేసుకొని తింటే చాల బాగుంటుంది….
Irikkayalu in Chittoor dist. also
Hi bro naki chettu kavali nadi Karimnagar nenu chala vethikanu dorakaledu plz Karimnagar lo ekkada dorukuthayo cheppadi na no 9704205861 Cal cheyandi
Hi bro e chettu Naku kavali nadi Karimnagar nenu chala try chesa dorakaledu ekkada dorukuthayo cheppadi na no 9704205861 cal cheyandi