హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి ఔషధ గుణాలున్న మొక్క నేల ఉసిరి గురించి తెలుసుకుందాం. ఈ మొక్కను మీరు మామూలుగా పొలాల దగ్గర, చెరువు గట్టు దగ్గర, రోడ్ల పక్కలో, ఇళ్ల మధ్యలో చూస్తూ ఉంటారు. దీనిని మనం ఒక పిచ్చి మొక్క అనుకుంటాం కానీ దీనిలో దాగి ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మొక్క చూడటానికి ఉసిరి చెట్టు అలాగే ఉంటుంది కాకపోతే ఉసిరి చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది కాని నేల ఉసిరి చిన్న మొక్కలా మాత్రమే ఉంటుంది. ఇది కేవలం 3 నుంచి ఐదు సెంటీమీటర్లు ఎత్తు మాత్రమే పెరుగుతుంది అందుకే దీనిని నేలఉసిరి అని అంటారు.
దీనికి మరో పేరు ఏక వార్షిక మొక్క ఎందుకంటే దీని జీవిత కాలం ఒక సంవత్సరం మాత్రమే. దీనినే భూమి ఆమ్లకి అని కూడా అంటారు. దీని యొక్క శాస్త్రీయ నామం phyllanthus amarus. ఈ మొక్కను బహుఫల మరియు బహుపత్ర మొక్కలు అని కూడా అంటారు ఎందుకంటే దీనిలో ఎక్కువ పత్రాలు మరియు ఆకులు వెనక చిన్న చిన్న ఫలాలు కలిగి ఉంటాయి. దీనిని ఇంగ్లీషులో సీడ్ అండర్ లీఫ్ (Seed Under Leaf) అని కూడా అంటారు. దీనికి గల ఇంకొక పేరు స్టోన్ బ్రేకర్ (Stone Breaker) ఎందుకంటే ఈ మొక్కలు ఎముకలు విరిగినప్పుడు ఉపయోగిస్తారు.
నేల ఉసిరి మొక్క ఉపయోగాలు
కామెర్లు జాండీస్
కామెర్లు ఇంగ్లీష్ లో జాండీస్ అని పల్లెటూర్లలో పసిరికలు అని అంటారు. నేల ఉసిరి లో hepatitis బి అనే వైరస్లను నిర్మూలించే శక్తి అధికంగా ఉంటుంది. ఈ మొక్కను వేర్లతో సహా తీసుకొని వచ్చి రోట్లో వేసి మెత్తగా నూరి వచ్చిన రసాన్ని పెరుగులో కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే కామెర్లు మనకు వెంటనే తగ్గుతాయి.
చర్మ వ్యాధులు
గజ్జి తామర ఎక్కువగా బాధపడేవారు ఈ మొక్కను తీసుకొనివచ్చి మెత్తగా దంచుకొని ఒక ముద్దలా చేసుకుని ఉప్పుతో కలిపి గజ్జి తామర ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.
ఎముకలు విరిగినప్పుడు
ఎముకలు విరిగినప్పుడు ఈ మొక్కను వేర్లతో సహా తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి రోట్లో వేసి మెత్తగా నూరి విరిగిన దేశంలో ఉంచి కట్టుకట్టినట్లయితే అక్కడ నొప్పి వాపు తగ్గి విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఎంతగానో దోహదపడుతుంది.
మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి
నేల ఉసిరి మొక్కలో కాల్షియం ఆక్సలేట్ ను కరిగించే శక్తి ఉండటం వలన మూత్రపిండాలలోని రాళ్లు ఇది కలిగిస్తుంది. 2004లో జరిగిన పరిశోధనలలో శాస్త్రవేత్తలు ఈ విషయం వెల్లడించారు. నేల ఉసిరి మొక్కను ఒక కషాయంలా చేసుకొని తాగడం వల్ల మూత్రపిండాలలోని రాళ్లు కరుగుతాయి.
ఉదర మరియు మూత్ర సమస్యలు
మూత్ర సంబంధిత సమస్యల నివారణకు ఈ మొక్కను వేర్లతో సహా తీసుకువచ్చి దీనిని మెత్తగా నూరి, వెలక్కాయ లోపల గల గింజల పొడిని ఒక భాగము, జీలకర్ర పొడి ఒక భాగము ఈ మూడింటిని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడడం వలన ఉపశమనం లభిస్తుంది.
పాము కాటు విరుగుడు
పాము కాటు విరుగుడు కు ఈ మొక్కను మెత్తగా నూరి పాము కరిచిన ప్రదేశంలో ఉంచితే విషయము లోపలికి ఇవ్వకుండా చేస్తుంది తర్వాత వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.
వెక్కిళ్ళు ఆకలి
కొంతమందికి వెక్కిళ్ళు ఎక్కువగా రావడము ఆకలి వేయలేకపోవడమే వంటి సమస్యతో బాధపడే వారు నేల ఉసిరి ఆకు ఉదయము సాయంత్రము నమలడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
వైరస్ వలన వచ్చే జ్వరాలు
అనేక వైరస్ల వల్ల వచ్చే జ్వరాలు అని తగ్గించడానికి ఈ మొక్క ఆకులను బాగా నూరి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉదయము సాయంత్రము తీసుకోవాలి.
పశువుల ఆరోగ్యానికి
మన ఇంట్లో ఉంటే పశువుల కి కంట నుండి నీరు కారుతూ ఉంటే దీనిని ఒక జ్యూస్ లా తయారు చేసి వాటి కళ్ళలో వేస్తే కళ్ళ నుండి కారే మీరు వెంటనే తగ్గుతుంది.
We have done reaserch on phylla thus amarus at spic for jaundice it is aprovem medicine for viral infections -may be we can try this for covid recovery along with haldi,kalmegh,