health benefits of papaya seeds

అబ్బాయిలు జాగ్రత్త..4 రోజులు వరుసగా బొప్పాయి తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో చూస్తే షాక్ అవుతారు

రోజూ అనేక రకాల పండ్లను తింటాం. అందులో అనేక రకాల విటమిన్లు లభిస్తాయి. అందులో బొప్పాయి అందరికీ ఇష్టమైన పండు. బొప్పాయిలో అనేక రకాల ఔషధగుణాలు ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగుపరచడంతో పాటు ఇంకా ఎన్నో ఆరోగ్య లాభాలను అందిస్తుంది. ప్రూట్ ఆఫ్ ఏంజెల్ అని పిలవబడే బొప్పాయి అందరికీ అందుబాటులో ఉండే పండు. మనదేశంలో ఎక్కువగా నండే మరియు తినే పండ్లలో బొప్పాయి ఒకటి. మనదేశంలో నిఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, పంజాబ్ లో ఎక్కువగా పండిస్తారు. ఈమధ్య కాలంలో డెంగ్యూ వ్యాధికి చికిత్స గా తినమని డాక్టర్ లు సైతం చెప్పడంతో ఈ పండుకి డిమాండ్ పెరిగింది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

బొప్పాయి తినడం వలన శరీరానికి కలిగే లాభాలేంటో చూద్దాం. విటమిన్ ఏ‌, కే.ఇ,సి తో పాటు బి కాంప్లెక్స్, బి1,బి 2, బి3,బి5, బి9 విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బయోఫ్లెవనాయిడ్స్ , ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివలన బొప్పాయి లోని షుగర్ని శరీరం తొందరగా గ్రహిస్తుంది. బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనివలన శరీరంలో  అన్ని సక్రమంగా జరిగేలా చేస్తుంది ఈ ఎంజైమ్స్ పనిచేస్తాయి. ఈ పండుని భోజనానికి తర్వాత తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడి అధికంగా ఉన్న ఫైబర్ వలన  మలబద్దకం సమస్య తగ్గుతుంది. బొప్పాయి లో పొపైన్ మరియు కైమా పొపైన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. 

ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్, రుమటాయిడ్స్, ఎడీమా, కీళ్ళు, కాళ్ళనొప్పులు, వాపులు ఉంటే తగ్గుతాయి. బొప్పాయి లో యాంటీ ఆక్సిడెంట్లు తోపాటు విటమిన్ ఇ,సికూడా ఉంటాయి కనుక మన శరీరంలోని ప్రీరాడికల్స్తో పోరాడి వృద్దాప్యలక్షణాలను ఆలస్యం చేస్తాయి. అలాగే ముఖంపై ముడతలు రాకుండా అడ్డుకుంటుంది. రోజుకొక ముక్క బొప్పాయి తింటే జీర్ణవ్యవస్థ కు మంచిది. ఇందులో ఉండే పొపైన్ మంచిబాక్టీరియాను వృద్ధి చేసేందుకు సహాయపడుతుంది. ఇన్ని లాభాలున్న బొప్పాయి గర్బవతులు ఎక్కువగా తింటే ఇందులో ఎక్కువ మొత్తంలో ఉన్న పెపిన్ వలన గర్బస్రావం అయ్యే అవకాశం ఉంది. 

బొప్పాయి లో ఉండే పాలవలన దురద వస్తుంది. బొప్పాయి ఎక్కువగా తింటే కెరొటినియా అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. శ్వాస సంబంధ వ్యాధులు ఉన్నవారు కూడా బొప్పాయి తినకూడదు. చర్మంపై వచ్చే దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఎక్కువగా తినకూడదు. దీనికి పొపైన్ అనే మూలకమే కారణం. చాలా జ్వరాలకు ఈ ఆకులరసాన్ని మందుగా వాడతారు. దీనివలన ప్లేట్లెట్లు పెరుగుతాయి. హైఫీవర్ ఉన్నప్పుడు ఈ పండుతినకూడదు. సమస్యను తీవ్రం చేస్తుంది. 

ఆస్తమా ఉన్నప్పుడు కూడా బొప్పాయి తినకూడదు. బొప్పాయి తినడంవలన స్కిన్ ఎలర్జీ, ఇంకా ఎన్నో శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. అలాగే పురుషులు కూడా బొప్పాయి ఎక్కువగా తినకూడదు. తినడంవలన వీర్యకణాలు తగ్గిపోతాయి. మధుమేహం ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. దీనివలన శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. శరీరంలో మరీ పడిపోకుండా మితంగా తినాలి. 

Leave a Comment

error: Content is protected !!