Health Benefits of Radish

రోజు తినే ముల్లంగిలో నమ్మలేని నిజాలు!!

 ప్రతి ఇంట్లో ముల్లంగి ఉడుకుతున్నప్పుడు వచ్చే వాసన అంటే చాలామందికి చిరాకు. అలాగే ముల్లంగితో చేసిన వంటకాలు కూడా అయిష్టంగా తింటుంటారు. కానీ  పొటాషియం, విటమిన్ సి మరియు ఫైబర్ లు సమృద్ధిగా కలిగివున్న ముల్లంగి ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. . ప్రతి ఒక్కరూ ముల్లంగిని ఇష్టపడకపోయినా, ఇది ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఉంటుంది – హృదయాన్ని రక్షించడం నుండి జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రించడం నుండి మధుమేహాన్ని అణిచివేయడం వరకు ఎన్నో విధాలుగా ముల్లంగి మ్యాజిక్ చేస్తుంది. కొన్ని ప్రయోజనాలు మీకోసం చూడండి మరి. 

 ఎర్ర రక్త కణాలను కాపాడుతుంది : 

ముల్లంగి మన ఎర్ర రక్త కణాలకు జరిగే నష్టాన్ని నియంత్రిస్తుంది మరియు ఈ ప్రక్రియలో రక్తానికి ఆక్సిజన్ సరఫరాను కూడా పెంచుతుంది .ముల్లంగిని తీసుకోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి శరీరంలో అవయవాలు కూడా సక్రమంగా స్పందించడం, పనిచేయడంలో దోహాధం చేస్తుంది.

  ఫైబర్‌ అధికం : 

 రోజువారీ తీసుకునే ఆహారంలో ముల్లంగిని చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన అధిక మొత్తంలో ఫైబర్ అందుతుంది. దీనివల్ల జీర్ణ క్రియ సమర్థవంతంగా ఉంటుంది.  అలాగే ముల్లంగి శరీరంలో అధిక వేడిని నియంత్రిస్తుంది, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

 గుండె ఆరోగ్యానికి అద్బుతమైనది: 

ముల్లంగి ఆంథోసైనిన్‌లను కలిగి ఉంటుంది. ఇవి గుండె పనితీరు సమర్థవంతంగా ఉండేలా సహకరిస్తుంది. గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  అలాగే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ మరియు ఫ్లేవనాయిడ్లు కూడా ఎక్కువగా గ్రహించేలా చేస్తాయి.

రక్తపోటును నియంత్రిస్తుంది: 

ముల్లంగి  శరీరానికి కావలసిన పొటాషియం అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఆకస్మికంగా పెరిగి తగ్గే  రక్త ప్రవాహాన్ని అదుపులో ఉంచుతుంది, ప్రత్యేకించి  రక్తపోటుతో బాధపడుతున్నట్టైతే ముల్లంగి అద్భుతమైన పలితాన్ని ఇస్తుంది. 

  రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: 

ముల్లంగిలో విటమిన్ సి అధికంగా ఉన్నందున, ఇది సాధారణ జలుబు మరియు దగ్గు నుండి సులువుగా కాపాడుతుంది మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.  దీన్ని దీర్ఘకాలికంగా తీసుకున్నట్టైతే  శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను  నిర్మూలించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

 రక్త నాళాలను బలపరుస్తుంది: 

 కొల్లాజెన్ రక్తకణాలు ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది, అలాగే రక్తనాళాలను దృఢపరుస్తుంది.  ముల్లంగిలో ఈ కొల్లాజెన్ ను ఉత్పత్తి చేసే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి.  

 జీర్ణక్రియను సమర్థవంతంగా ఉంచుతుంది:

 ఇందులో అధిక మొత్తం ఫైబర్ ఉండటం వలన,  జీర్ణక్రియ సమర్థవంతంగా ఉంటుంది. ఆమ్లత్వం, ఉబకాయం, గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు వికారం వంటి వాటిని పరిష్కరించడానికి కూడా ఇది సహాయపడుతుంది.  

పోషకాలు అధికం:

 ఎరుపు ముల్లంగిలో విటమిన్లు ఇ, ఎ, సి, బి 6, మరియు కె. ప్లస్ యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, జింక్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, రాగి, కాల్షియం, ఇనుము మరియు మాంగనీస్ అధికంగా ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్కటి మన శరీరాన్ని మంచి పని స్థితిలో ఉంచుతాయి.  

చర్మ సంరక్షణకు మంచిది:  

ప్రతిరోజూ ముల్లంగి రసం తాగితే,  ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మానికి అదనపు శక్తిని ఇచ్చినట్టు అవుతుంది.  దీనికి కారణం విటమిన్ సి, జింక్ మరియు భాస్వరం.  అలాగే మొటిమలు మరియు దద్దుర్లను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మంలోని మలినాలను సమార్గవంతంగా తొలగిస్తుంది. ముఖ సౌందర్యం కోసం ముల్లంగిని పేస్ట్ గా చేసి ఉపయోగించవచ్చు.  

 హైడ్రేషన్‌కు మంచిది: 

 వేసవిలో ముల్లంగిని కొంచెం ఎక్కువగా తింటే అందులో ఉన్న అధికశాతం నీరు శరీర తాపాన్ని తగ్గిస్తుంది. తద్వారా వడదెబ్బ లాంటి సమస్యల నుండి తప్పించుకోవచ్చు.

చివరగా…..

పైన చెప్పుకున్నట్టు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ముల్లంగిని దూరం పెట్టకుండా తినడం మొదలుపెట్టండి.

Leave a Comment

error: Content is protected !!