భారతదేశంలో మరియు విదేశాలలో వివిధ సాంప్రదాయ వంటలలో విస్తృతంగా ఉపయోగించబడే రాజ్మా బీన్స్ మంచి పొదకలు నిండి ఉంటుంది. ఇది రూపాన్ని, రంగును మూత్రపిండాలను పోలి ఉంటుంది అందుకే కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు.
చిక్కుడు జాతికి చెందిన వీటిలో శాస్త్రీయంగా ఫేసియోలస్ వల్గారిస్ అని పిలువబడే మొక్క నుండి సేకరించబడతాయి. ఈ బీన్స్ భారతదేశం తో సహా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా సాగు చేయబడుతున్నాయి. నార్త్ ఇండియన్ వంటకాల్లో తప్పనిసరిగా ఉండే రాజ్మా బీన్స్ వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే వీటిలో బోలెడు పోషకాలు ఉన్నాయి కాబట్టి. ఒకసారి వీటిలోని పోషకాల గూర్చి చూద్దామా….
రాజ్మా గూర్చి కొన్ని నిజాలు
ఈ బీన్స్ ప్రోటీన్ మరియు మాంసాహారనికి ప్రత్యామ్నాయం గా చెప్పుకోవచ్చు. . రాజ్మా బీన్స్ ను వంటల్లో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి మాంసం ద్వారా లభించే పోషకాలకు దీని ద్వారా అందించినవాళ్ళం అవుతాము.
రాజ్మా బీన్స్ లో రాగి, ఇనుము, మాంగనీస్, భాస్వరం, మాలిబ్డినం మరియు విటమిన్లు బి 1 మరియు ఫోలేట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అతితక్కువ చెక్కెరలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) కలిగి ఉండటం వల్ల డయాబెటిక్ ఉన్నవారికి అనువైన ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది.
ఇంకా ఇందులో పిండి కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు మరియు తగినంత పోషకాలతో జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.. అంతేకాకుండా, ఈ చిక్కుళ్ళలో ఐసోఫ్లేవోన్ మరియు ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. , ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి, అకస్మాత్తుగా వచ్చే రక్తపోటు ను మరియు గుండె కండరాల పనితీరు మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

రాజ్మా బీన్స్ తీసుకోడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు:
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
రాజ్మా ఒక అద్భుతమైన చిక్కుళ్ళు, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ఇది కరిగే ఫైబర్ ను కలిగి ఉంటుంది. కిడ్నీ బీన్స్ లో కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచకుండా నిరోధించగలవు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి, ఇన్సులిన్ ను మెరుగుపరుస్తాయి
గుండె ఆరోగ్యానికి
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో రాజ్మాలోని ఫైబర్ ప్రయోజనకరంగా ఉంటుంది. రాజ్మాలో కరిగే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని మరియు కడుపులో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరచడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుందని మరియు శరీరంలోకి కొలెస్ట్రాల్‌ను తిరిగి గ్రహించడాన్ని నిరోధిస్తుందని నిపుణులు నిర్ధారించారు. రాజ్మాలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటంలో తోడ్పడుతుంది. గుండెపోటు రాకుండా చేస్తుంది.
క్యాన్సర్‌ను నివారిస్తుంది
క్యాన్సర్ రాకుండా సహాయపడే యాంటీఆక్సిడెంట్ల అధిక మొత్తం రాజ్మలో ఉన్నాయి. దీనిలో ఫ్లేవనాయిడ్లు క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. రాజ్మాలోని లిగ్నన్స్ మరియు సాపోనిన్లు క్యాన్సర్ కణాలతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి రాజ్మాను ఆహారంలో భాగం చేసుకుంటే కాన్సర్ కు దూరంగా ఉన్నట్టే.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రాజ్మాలో కరిగే ఫైబర్ మరియు ప్రోటీన్ యొక్క సమ్మేళనం బరువు తగ్గించడం లో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆకలిని మందగిస్తుంది దీనివల్ల అతిగా తినడం కు దూరంగా ఉండగలుగుతారు. రాజ్మాలో ఆల్ఫా-అమైలేస్ ఇన్హిబిటర్ ఉండటం వల్ల కార్బోహైడ్రేట్స్ యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఎముకలను బలపరుస్తుంది
ఎముకలను బలోపేతం చేయడానికి మరియు బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి అవసరమైన ఖనిజాలు, కాల్షియం మరియు మెగ్నీషియంతో రాజ్మ నిండి ఉంటుంది. రాజ్మాలో ఎక్కువ శాతం ఫోలేట్ ఉంటుంది ఇది శరీరంలో అసమానతలను క్రమబద్దం చేస్తుంది.
చివరగా……
రాజ్మా బీన్స్ మన ప్రాంతీయ వంటకంలో వాడకపోయినా వీడేటిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గొప్ప ఆరోగ్య లాభాలు పొందడం మాత్రం వస్ఘవం కాబట్టి రాజ్మా ను ఆరోగ్యానికి రాజుగా చెప్పుకోవడంలో తప్పులేదుగా.