బీరకాయ కూరగాయల్లో అందరికీ అందుబాటులో ఉండే కూరగాయలు. అందుకే పెద్దగా ఎవరృ వాటి ఆరోగ్య ప్రయోజనాలు గురించి మాట్లాడరు. మన తెలుగు వారు అనేకరకాల వంటలు వండుతారు బీరకాయలతో. పప్పు తో వండినా వేపుడు, పచ్చడి ఇలా ఎన్నిరకాలుగా చేసినా మంచిరుచిని ఇచ్చే బీరకాయ పోషకాలలోనూ అద్బుతమైనదే అని చెప్పాలి. బీరకాయలో విటమిన్లు, ఘగర్స్, మినల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వారానికి రెండు సార్లు బీరకాయ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మద్యం తాగడంవలన కాలేయంలో విషపదార్థాలు చేరి కాలేయరోగాలతో బాధపడుతుంటే బీరకాయ తినడంవలన కాలేయం భద్రంగా ఉంటుంది. అందుకే మందుబాబులు ఆహారంలో బీరకాయ చేర్చడంవలన లివర్ ఆరోగ్యం రక్షించవచ్చు. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
బీరకాయ లో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు బీరకాయను తినొచ్చు. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సహకరిస్తాయి. మహిళల్లో ముఖ్యంగా రక్తహీనత సమస్య బాధపెడుతుంది. దీనికి ముఖ్య కారణం ఐరన్ లోపం. బీరకాయ ఐరన్ లోపాన్ని తగ్గించి ఎర్రరక్తకణాల వృద్దికి సహాయపడుతుంది. రక్తహీనత ను తగ్గిస్తుంది. బీరకాయ ఆరోగ్యంతో పాటు అందాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది. పోషకాహార లోపం వలన చర్మసమస్యలు వస్తుంటాయి. బీరకాయ వారంలో రెండు రోజులు తీసుకోవడంవలన పోషకాహారం లోపాన్ని తగ్గించి ముఖంపై మచ్చలు, మొటిమలు నిరోధిస్తుంది. ముఖం కాంతివంతంగా తయారయ్యేలా చేస్తుంది. గుండెసంబంధ సమస్యలు ఉన్నవారు వారంలో రెండు రోజులు బీరకాయ తినడంవలన గుండెఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీరకాయ మధుమేహం ఉన్నవారికి కూడా మంచి ఆహారం.
బీరకాయ లో ఉండే పెప్టైన్స్ రక్తం మరియు యూరిన్లో ఉండే క్కెర స్థాయిలను అదుపుచేస్తుంది. కంటిఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మనం బయట దొరికే జంక్ ఫుడ్, మసాలా ఫుడ్ తినడానికి అలవాటు పడ్డాం. వీటివలన శరీరంలో నూనె, జిడ్డు చేరి జీర్ణాశయంలో బాక్టీరియా పెరిగి జీర్ణవ్యవస్థకు అవరోధం ఏర్పడుతుంది. బీరకాయ బాక్టీరియాను తగ్గించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ తగ్గించి కడుపును చల్లబరిచి వేడిని తగ్గిస్తుంది. మొత్తం శరీర ఆరోగ్యం రక్షించడంలో మంచి పాత్ర పోషిస్తుంది. బాలింతలలో పిల్లలకు వేడిచేస్తుందని చాలా కూరగాయలు పెట్టరు. కానీ పాలు ఉత్పత్తికి, తల్లి ఆరోగ్యానికి మంచిదని బీరకాయ మాత్రం పెడుతుంటారు. ఇన్ని సుగుణాలున్న బీరకాయను మన ఆహారంలో కూడా భాగం చేసుకుందామా మరి.