health benefits of sadapushpam

కేవలం 1 ఆకుతో జుట్టు మళ్ళీ నల్లగా మారుతుంది,ముఖం కాంతివంతంగా, శరీరం ఉక్కులా,వృద్ధాప్యం ఎప్పటికీ రాదు

మన చుట్టూ ఉండే మొక్కల్లో చాలా విలువైన ఔషధగుణాలు ఉన్న మొక్కలుంటాయి. వాటి గురించి అవగాహన లేక పట్టించుకోము. వాటిలో అతి ముఖ్యమైనది బిల్లగన్నెరు. ఎవరి సాయంలేకుండా పెరిగే ఈ మొక్క అనేక చికిత్సల్లో ఉపయోగిస్తుంటారు. పువ్వులతో మొక్క ఎప్పుడూ పచ్చగా కనివిందు చేస్తుంటుంది. ఇది ఎప్పుడు పుష్పిస్తూనే ఉంటుంది. అందుకే దీనిని సదాపుష్పి, సదా బహార్ అనేక పేర్లతో పిలుస్తారు. ఇంగ్లీషులో రోజ్బెరీ వింకిల్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. దీని స్వస్థలం మడగాస్కర్. ఈ మొక్క ఏడునుండి ఇరవై అంగుళాల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు నునుపుగా మెరుస్తూ కనిపిస్తాయి. ఈ మొక్కలలో చాలా రకాల పువ్వులు పూసే మొక్కలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

ఇందులో తెలుపు, పింక్ కలర్ పువ్వులు పూసే మొక్కలు అద్బుతమైన ఔషధప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఈ చెట్టు వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు అన్నీ ఔషధాలలో ఉపయోగిస్తారు. దీనిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారని చాలామందికి తెలియదు.  వాటిగురించి తెలుసుకుందాం. ఈ పువ్వులలో ఎన్నో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి కాన్సర్, మధుమేహం రాకుండా చేస్తాయి. కాన్సర్ ప్రమాదం ఉన్నవారికి ఇది శ్రీ రామ రక్ష. ఇందులో యాంటీ కాన్సర్, యాంటీ ట్యూమర్ యాక్టివిటీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా అనేకరకాల వైద్య చికిత్సల్లో వాడతారు. రక్తప్రసరణ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఐదు బిల్లగన్నెరు ఆకులను కడిగి రసంతీసి రెండు గ్రాముల మోతాదులో ఉదయం సాయంత్రం తీసుకోవాలి.ఇలా తీసుకుంటే ఆందోళన, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. గొంతుసంబంధ సమస్యలు తగ్గుతాయి. 

నెలసరి సమయంలో రక్తస్రావం అధికంగా అవుతుంది. వారికి బాగా ఉపయోగపడుతుంది. చెడుకొలెస్ర్టాల్ కరిగిపోతుంది. కీళ్ళనొప్పులు ఉన్నవారికి కూడా తగ్గుతాయి. మధుమేహం రోగులకు దివ్యౌషధం. బిల్లగన్నెరు వేరు తీసుకుని నీటిలో వేసి సన్నని మంటపై బాగా మరిగించి తర్వాత వడకట్టి ఆ నీటిని రోజూ తాగితే నలభై ఎనిమిది రోజుల్లో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. ఈ నీటిని తాగడంవలన కిడ్నీలో వాపు మొలలు ఫైల్స్ సమస్య తగ్గుతుంది. ఈ పూవుల కషాయాన్ని మొలలు ఉన్నచోట రాస్తే మొలలు తగ్గిపోతాయి. చర్మకాంతిని పెంచడానికి, ముఖంపై మచ్చలు మొటిమలు తగ్గడానికి ఈ మొక్కల ఆకుల పొడితో సమానంగా వేపాకులపొడి పసుపు కలిపి ఫేస్పాక్ లా వేస్తే ముడతలు మచ్చలు తగ్గి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. 

1 thought on “కేవలం 1 ఆకుతో జుట్టు మళ్ళీ నల్లగా మారుతుంది,ముఖం కాంతివంతంగా, శరీరం ఉక్కులా,వృద్ధాప్యం ఎప్పటికీ రాదు”

Leave a Comment

error: Content is protected !!