health benefits of sitanshu rasa tablets

సర్వ రోగ నివారిణి శీతాంశు రసం ను ఎలా ఉపయోగించాలో తెలుసా??

 జబ్బు లేని మనిషంటూ ఈ కాలంలో కనిపించడం లేదు. జబ్బులు కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరికి కనీసం ఏదో ఒక సమస్య, అది తాత్కాలికమో, దీర్ఘకాలికమో మొత్తానికి తోకలాగా ఏదో ఒక సమస్య వెంటే ఉంటుంది. అయితే జబ్బుకు తగ్గ మందు వెతుక్కుని వేసుకుని తగ్గించుకోవడం అందరూ చేసే పనే. కానీ ఎన్ని  జబ్బులు వచ్చినా అన్నిటిని పారద్రోలే ఔషధం ఒకటి ఉంది. అదే శీతాంశు రసం.  ఎలాంటి జబ్బు వచ్చినా తరిమికొట్టగల శీతాంశురసం ను ఎలా తీసుకోవాలో తెలిస్తే ఇక ఇల్లంతా మందులతో నింపాల్సిన అవసరం ఉండదు. మరి ఎలా వాడాలి చూసేద్దాం రండి.

శీతాంశు రసమంటే ఏమిటి అని సందేహం అందరికి ఉండవచ్చు. అందుకే చెబుతున్నా శీతాంశు రసం మాత్రల రూపంలో దొరికే ఔషధం. అన్ని రకాల ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి.

◆ దగ్గు, జలుబు, జ్వరం, వాతవ్యాధులు, అజీర్తి, కడుపునొప్పి, తల తిరగడం చర్మవ్యాధులు వంటి సమస్యలకు శీతాంశురసం వాడతారు. రోజూ రెండు పూటలా ఈ మాత్రలు ఒకటి లేదా రెండు మంచి నీటితో వేసుకోవాలి. దీనివల్ల చెప్పుకున్న సమస్యలు బలాదూర్.

◆శీతాంశు రసంతో పాటు కరక్కాయ పొడిని తేనెతో కలిపి తీసుకోవాలి ఇలా తీసుకున్న తరువాత వేడినీళ్లు తాగితే చలి జ్వరం, దగ్గు, ఆయాసం వంటివి తగ్గుతాయి.

◆ వేపాకురసం లో శీతాంశు మాత్రలను రెండు మూడు వేసి బాగా అరగదీసి ఆయింట్మెంట్ లా చేసి వాడితే గజ్జి, తామర వంటి మొండి వ్యాధులు మాత్రమే కాకుండా దురద, ఎగ్జిమా  వంటి చర్మవ్యాధులు కూడా తగ్గుతాయి.

◆ చాలా మంది ఎదుర్కొనే సమస్య  నోటి అల్సర్ లేదా నోటి పుండ్లు. ఇలాంటి సమయంలో శీతాంశు మాత్రలను నీటిలో అరగదీసి చీక్కటి లేపనంగా చేసి పుండ్లు మరియు పొక్కులు ఉన్న చోట వేయాలి. ఇలా చేస్తుంటే తొందరగా తగ్గిపోతాయి.

◆ ధనుర్వాతం సమస్య వచ్చిన వారికి రోజు మూడు లేదా నాలుగు మాత్రల వరకు వాడితే  వ్యాధి తొందరగా నయమవుతుంది.

◆ కాకరకాయ,  వేపాకు రసం తో శీతాంశు మాత్రలను తీసుకుంటే కుక్కకాటుకు గురైనప్పుడు విరుగుడుగా పనిచేస్తుంది. పిచ్చి లక్షణాలను దరిచేరనివ్వదు.

◆జ్వరం విడవకుండా ఉండి, యాంటీ బయాటిక్స్ వాడవలసి వచ్చినపుడు కూడా శీతాంశు రసం మాత్రలను వేసుకుని, చిత్రమూలం, శొంఠి, మిరియాల పొడిని పాలలో కలిపి తాగాలి. జ్వరం తగ్గేవరకు వీటిని వాడచ్చు ఎలాంటి దుష్ప్రభావం ఉండదు.

◆ శీతాంశు రసం మాత్ర వేసుకున్న తరువాత

 సీతోఫలాది చూర్ణాన్ని తేనెతో రంగరించి తీసుకుంటే దగ్గు, జలుబు, ఆయాసం వంటి సమస్యలకు బాగా పనిచేస్తుంది.

చివరగా…..

శీతాంశురసం మాత్రలు ప్రతి ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. ప్రతి ఇంట్లో వీటిని తప్పనిసరిగా ఉంచుకోవడం వల్ల పైన చెప్పుకున్న సమస్యలకు అన్నిటికి కూడా పనిచేసే ఏకైక సర్వరోగ నివారిణి అవుతుంది. అందుకే తప్పకుండా ఇంటికి తెచ్చేసుకోండి.

2 thoughts on “సర్వ రోగ నివారిణి శీతాంశు రసం ను ఎలా ఉపయోగించాలో తెలుసా??”

  1. సొరియాసిస్ అనే చర్మ వ్యాధి పోవడానికి తీసుకోవలసిన ఆయుర్వేద ఔషధం మరియు వాడే విధానం చేయవలసిన ఆహార సంబంధ నియమాలు

    Reply

Leave a Comment

error: Content is protected !!