real health benefits of soaked almonds

ఖాలీ కడుపుతో బాదం తింటున్నారా?చాలా మందికి తెలీదు బాదంపప్పు ఎలా తినాలి,ఎవరు తినాలి అలాగే ఎన్ని తినాలి

బాదంపప్పులను రోజూ తినాలి అని తెలుసు కానీ ఎలా తినాలో తెలియదు. నానబెట్టినవి తినాలా లేదా మామూలుగా తినచ్చా అనేది చాలామందికి ఉన్న అనుమానం. దాని వివరాలు తెలుసుకుందాం. రోజు పడుకునే మందు నాలుగయిదు బాదంపప్పులను నానబెట్టి ఉదయాన్నే తోలు తీసి తినాలి. బాదంతొక్కలో టానిక్ అనే రసాయనం ఉంటుంది. మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఇలా నానబెట్టిన బాదంపప్పులలో అద్బుతమైన పోషకవిలువలు, ప్రయోజనాల ఉంటాయి. బాదంపప్పులో ఫైటిక్ ఆమ్లం కూడా అధికంగా ఉంటుంది. ఇలా నానబెట్టిన బాదంపప్పులో బరువు తగ్గించి,రక్తపోటు,గుండె సంబంధ వ్యాధులు రాకుండా చేసే గుణాలు అధికంగా ఉంటాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

ఇది కొన్ని ఖనిజాలను బంధించి, వాటిని గ్రహించకుండా నిరోధిస్తుంది. రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడంవలన ఒమెగా త్రీ, ఫైబర్ అధికంగా ఉంటాయి. మలబద్దకం తగ్గించి జీర్ణసంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. దీనివలన బాదంను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఉండే ప్రొటిన్ కారణంగా తొందరగా ఆకలివేయదు. అలాగే మెగ్నీషియం వలన ఎముకలు బలపడతాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. రక్తపోటును తగ్గిస్తాయి. ఉదయాన్నే తీసుకోవడం వలన అజీర్తిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే లిపేజ్ అనే ఎంజైమ్ అధికకొవ్వును కరిగిస్తుంది.

 అప్పుడప్పుడు నానబెట్టిన బాదం తినడం వలన చిరుతిండ్లు వైపు మనసు మళ్ళదు.బరువు తగ్గడం తేలికవుతుంది. చెడుకొవ్వును కరిగించి మంచికొవ్వును పెంచి గుండెఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఇందులో ఉండే  విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసి ప్రీరాడికల్స్తో పోరాడతాయి. త్వరగా వృద్దాప్య లక్షణాలు రాకుండా చేస్తాయి. ఎనర్జీ తగ్గకుండా చేసి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ 17 కాన్సర్ తో పోరాడతాయి. బాదంలో ఉండే ఫ్లెవనాయిడ్స్ కణితులు ఏర్పడకుండా చేస్తాయి. గ్లూకోజ్ లెవల్స్ తగ్గించి మధుమేహాన్ని అదుపుచేస్తాయి. గర్బవతుల్లో ఇలా నానబెట్టిన బాదం తింటే ఇందులో ఉండే పోలిక్ యాసిడ్స్ పిండంలో లోపాలను తగ్గిస్తాయి. రోజూ నానబెట్టిన బాదం తినడంవలన పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగి భవిష్యత్తు లో అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధులను దూరంగా పెడుతుంది.

1 thought on “ఖాలీ కడుపుతో బాదం తింటున్నారా?చాలా మందికి తెలీదు బాదంపప్పు ఎలా తినాలి,ఎవరు తినాలి అలాగే ఎన్ని తినాలి”

Leave a Comment

error: Content is protected !!