Health Benefits of Stevia Plant

మధుమేహం, కేలరీల బెంగ లేకుండా తీపిని అందించే అద్భుతమైన ఈ మొక్క గూర్చి మీకు తెలుసా….

స్వీట్లు అంటే బోలెడు ఇష్టం తిందామంటే చెక్కెరలో ఉన్న బోలెడు కేలరీల భయం. బదులుగా బెల్లం వాడితే అన్నిటికి అది సరైన విధంగా మాచ్ అవ్వదు, తేనెను అన్ని విధాలుగా వాడుకోలేము. ఈ మూడు కూడా తీపిని ఇచ్చేవే అయినా వీటిలో కేలరీలు కొద్దీ పాటి తేడాతో ఉంటాయి.  స్వీట్లు అంటే ఇష్టం ఉండి తినడానికి భయపడే వారికి శుభవార్త. తియ్యదనాన్ని ఇస్తూ క్యాలరీల భయం లేకుండా అందరిని ఆనందింపజేసే ఒక గమ్మత్తైన తీపి వనరు గూర్చి బహుశా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.

తులసి, పుదీనా లాగా  కనిపిస్తూ గొప్ప తియ్యదనాన్ని కలిగిన మొక్క ఒకటుంది. విదేశాల్లో పెరుగుతూ గుర్తించబడ్డ ఈ మొక్కను స్టెవియా గా పిలుస్తున్నారు. తీపి అంటే ఇష్టం ఉన్నవారు, మధుమేహం కారణంగా తీపైకి దూరమైనవారు నిరభ్యరంతంగా స్టెవియా ను తీసుకోవచ్చని ఎందరో నిపుణులు ధృవీకరిస్తున్నారు కూడా. మరి ఈ స్టివియా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒక్కసారి చూడండి.

స్టెవియా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

◆ స్టెవియా లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  భాగాల వారీగా దీని ఆకులు, చక్కెర కంటే 40 రెట్లు ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి.  స్టెవియాలో ఈ తీపి నాణ్యత స్టెవియోసైడ్, స్టెవియోల్బయోసైడ్, రెబాడియోసైడ్లు A-E మరియు డల్కోసైడ్లతో సహా అనేక గ్లైకోసైడ్ సమ్మేళనాల కారణంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక సహజ అత్యుత్తమ తీపి పదార్థం.

◆ స్టెవియోసైడ్ కార్బోహైడ్రేట్ కాని గ్లైకోసైడ్ సమ్మేళనం.  అందువల్ల, సుక్రోజ్ మరియు ఇతర కార్బోహైడ్రేట్లు కలిగి ఉన్న లక్షణాలు దీనికి లేవు.  స్టెవియా లోని రెబాడియోసైడ్-ఎ చక్కెర కంటే 300 రెట్లు తియ్యగా ఉంటుంది.  అంతేకాకుండా, ఇందులో కేలరీల శాతం సున్నా. స్టెవియాఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వున్నా కూడా పాడవ్వకుండా నిల్వ ఉండగలదు. 

◆ స్టెవియా మొక్కలో ట్రైటెర్పెనెస్, ఫ్లేవనాయిడ్లు మరియు టానిన్లు వంటి అనేక స్టెరాల్స్ మరియు యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉన్నాయి.  కెంప్ఫెరోల్, క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ ఆమ్లం, కెఫిక్ ఆమ్లం, ఐసోక్వెర్సిట్రిన్, ఐసో-స్టీవియోల్ మొదలైనవి స్టెవియాలో ఉన్న ఫ్లేవనాయిడ్ పాలిఫెనోలిక్ యాంటీ-ఆక్సిడెంట్ ఫైటోకెమికల్స్. కెమ్ఫెరోల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని 23% తగ్గిస్తుంది.

◆ క్లోర్జెనిక్ ఆమ్లం గ్లైకోజెన్ మరియు గ్లూకోజ్ యొక్క ఎంజైమాటిక్ మార్పిడిని తగ్గిస్తుంది, అంతేకాక గట్లోని గ్లూకోజ్ శోషణ తగ్గుతుంది.  అందువలన, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది.  

◆ రక్త నాళాలను విడదీయడానికి, సోడియం విడుదల ను పెంచడానికి మరియు మూత్ర విసర్జనకు స్టెవియా సారం లోని కొన్ని గ్లైకోసైడ్లు దోహదం చేస్తాయి.  ఫలితంగా ఇది బిపి ని కంట్రోల్ లో ఉంచగలుగుతుంది.

◆ కార్బోహైడ్రేట్ కాని స్వీటెనర్ కావడం వల్ల, నోటిలోని స్ట్రెప్టోకోకస్ ముటాన్స్ బ్యాక్టీరియా పెరుగుదలకు స్టెవియా అనుకూలంగా ఉండదు, ఇది దంత క్షయం మరియు దంత కావిటీస్ కు ఎలాంటి హానిచేయదు.  స్టెవియాలోని కొన్ని సమ్మేళనాలు నోటిలో అల్సర్ కలిగించే బ్యాక్టీరియాను నిరోధిస్తాయి.

 ◆ఇదొక ఔషధ మొక్కగా గుర్తించబడటం వల్ల ఇందులో అనేక ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి.

 సాంప్రదాయ వైద్యంలో స్టెవియా మొక్క ఉపయోగాలు.

 స్టెవియా పాశ్చాత్య దేశాలలో బరువును తగ్గించడానికి విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా  గాయాలు తగ్గించడంలో, అంటువ్యాధులు, తాపజనక పరిస్థితులు, కాళ్ళలో వాపు మరియు మానసిక వత్తిడి దాని ద్వారా కలిగే  నిరాశకు, నిరుత్సాహం వంటి సమస్యలకు చికిత్స చేయడానికి ఒక అద్భుతమైన ఔషధ వనరుగా ఉపయోగిస్తున్నారు.

చివరగా…..

తీపి తినాలని అనిపిస్తే ఇక మీదట దూరం గా ఉండక్కర్లేదు నిస్సందేహంగా స్టెవియా మొక్కను ఉపయోగించడం, స్టెవియా ద్వారా తయారు కాబడ్డ చెక్కెరను ఉపయోగించడం ద్వారా కోల్పోయిన తియ్యదనాన్ని మళ్ళీ పొందండి.

1 thought on “మధుమేహం, కేలరీల బెంగ లేకుండా తీపిని అందించే అద్భుతమైన ఈ మొక్క గూర్చి మీకు తెలుసా….”

Leave a Comment

error: Content is protected !!