చిలకడదుంపలు చాలామంది ఇష్టంగా తినే అల్పాహారం. తియ్యగా ఉండే ఈ దుంపలను కూరగాయగా వాడతారు. దీంట్లో ఉండే కార్బోహైడ్రేట్లు ,చక్కెర ఈ గడ్డలను మరింత రుచిగా తయారుచేస్తాయి. వీటిని కాల్చి, ఉడికించిన లేదా సలాడ్‌లా కూడా తింటారు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. మొరంగడ్డ, కందగడ్డ, రత్నపురి గడ్డ అని పిలుస్తారు. ఇందులో ఉన్నన్ని పోషకాలు ఎందులోనూ దొరకవనేది అతిశయోక్తి కాదు. వారానికి కనీసం రెండు మూడు సార్లు తినడంవలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. ప్రొటీన్లను అందించడంతో పాటు శరీరంలోని టాక్సిన్లు బయటకు పంపడానికి కూడా సహకరిస్తుంది. ఇందులో అనేక ఖనిజ లవణాలతో పాటు కార్బోహైడ్రేట్లు, విటమిన్ బి, సి ,ఇ ఉంటాయి. మరింత సమాచారం తెలుసుకోవడంకోసం ఈ లింక్ చూడండి
అంతేకాకుండా కార్డినోయాడ్స్ ,ఫాలీపినాల్స్ ఉంటాయి. ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. ఇందులో ఉన్న పోషకాలు మనం తీసుకునే విధానాన్ని బట్టే శరీరం గ్రహిస్తుంది. ఉడికించిన గడ్డలను పిల్లలకు పెట్టడంవలన వారి శరీరంలో ఉన్న విషరసాయనాలు బయటకు వెళ్ళిపోతాయి. రత్నపురి గడ్డల్లో పొటాషియం అధికంగా ఉండి గుండె సంబంధ వ్యాధులను అదుపుచేస్తుంది. నరాల సంకేతాలను అదుపుచేస్తుంది. పొటాషియం మూత్రపిండాల్లో వ్యాధులను, శరీరంలో వాపులు , నొప్పులను, కండరాలలో తిమ్మిరులను కూడా తగ్గిస్తుంది. ఫైబర్ పుష్కలంగా లభించి గ్యాస్, ఎసిడిటీ మలబద్దకానికి చెక్ పెడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ యాంటీకాన్సర్ ఏజెంట్‌గా పనిచేసి కాన్సర్ కణాలతో పోరాడుతుంది.
యూవీ రేస్ వలన కలిగే నష్టం నుండి వీటివలన ప్రమాదానికి గురైన కణాలను భర్తీ చేయడానికి ఎ విటమిన్ సహకరిస్తుంది. బంగాళాదుంపలకన్నా చిలకడదుంపల్లో పీచు శాతం ఎక్కువ. అందువలన నెమ్మదిగా జీర్ణమవుతూ కాలరీస్ ఎక్కువ సేపు వివిధ విడుదలవుతాయి. డయాబెటిస్ ఉన్నవారు తినకూడదు అనుకుంటారు కానీ ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపుచేస్తాయి. ఇందులో ఉండే మాంగనీస్ గ్లూకోజ్ స్థాయిలను అదుపుచేస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు కూడా మితంగా తినవచ్చు. ఇందులో ఉండే మాంగనీస్ ఎముకలను బలంగా చేసి కాన్సర్ కణాలను అణచివేస్తుంది. విటమిన్ డి ఉండి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మానసిక సమస్యలు రాకుండా చేసి శరీరంలో శక్తిని పెంపొందిస్తుంది. నీరసం, నిస్సత్తువ లేకుండా చేస్తుంది.