health-benefits-of-sweet-potato

చిలకడ దుంప (స్వీట్ పొటాటో) లో ఇన్ని పోషకాలున్నాయని మీకు తెలుసా….

చిన్నప్పుడు విరివిగా దొరికెవి ఇపుడు ఖరీదుగా మారిపోయాయి. అలాంటివి బోలెడు ఉన్నాయ్. వాటిలో చిలకడ దుంప కూడా ఉంటుంది. కూరలనుండి వేపుడు వరకు. ఉడికించుకుని, కాల్చుకుని తినడం నుండి పచ్చిదే కొబ్బరిలా తినేయడం వరకు ఎన్నో రకాలతో కనువిందు చేస్తుంది.  ఈమధ్య అయితే చిలకడ దుంప పూర్ణాలు, బొబ్బట్లు కూడా తయారైపోతున్నాయ్. దుంపల్లో అన్నిటిలోకి విభిన్నమైన చిలకడ దుంప తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

అవేంటో చిలకడ దుంపల్లో ఉన్న పోషకాలు మనకు ఎలా మంచి చేస్తాయో ఒకసారి చూద్దాం.

◆తియ్యగా ఉండే ఈ దుంపలో పిండి పదార్థాల తో పాటు చక్కెర శాతం అధికంగా ఉంటుంది  

◆ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. చిలగడ దుంప తీసుకోవడం వల్ల బిపి ని అదుపులో ఉంచుతుంది.

◆చిలకడ దుంప రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు దరిచేరనివ్వదు. కండరాల తిమ్మిర్లు, వాపులు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

◆చిలకడ దుంపలో లభించే విటమిన్ ఎ కంటి చూపుకు ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. మరియు యాంటీ క్యాన్సర్ కారకంగా పని చేసే కణాలను అభివృద్ధి చేస్తుంది.

◆చిలకడ దుంపలో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల చిలకడ దుంపను ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షించి ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది.

◆విటమిన్-సి  కూడా చిలకడ దుంపలో లభ్యమవుతుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందించి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఎలాంటి జబ్బులకు తొందరగా లొంగకుండా ఉండేలా చేస్తుంది.

◆చిలకడ దుంపల్లో  ముఖ్యంగా చెప్పుకోవలసింది ఫైబర్ గూర్చి. ఇందులో పిండి పదార్థాలు ఎంత మోతాదులో ఉంటాయో అంతే ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణాశయం ను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కడుపులో పుండ్లు అల్సర్ వంటి వాటిని నయం చేయడమే కాకుండ ఎసిడిటీ ను నివారిస్తుంది. జీర్ణ క్రియ సమర్థవంతంగా ఉండటం వల్ల మలబద్దకం కూడా నివారించబడుతుంది.

◆చిలకడ దుంపల్లోని బీటా కెరోటిన్ మరియు బి కాంప్లెక్సుల వల్ల శరీరంలో  తెలుపు మరియు ఎరుపు రక్తకణాలు అభివృద్ధి చెందుతాయి. ఇందులో ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల అనిమియా వంటి సమస్యలతో బాధపడేవారు చిలకడ దుంపను తీసుకుంటే మంచిది.

చివరగా….

స్వీట్ పొటాటో గా పిలుచుకునే మన చిలకడ దుంపతో పీకీ చెప్పుకున్నా ప్రయోజనాలను అన్నిటినీ పొందాలని అనుకుంటే రోజువారీ ఆహారంలో తప్పక చేర్చుకోవలసిందే

Leave a Comment

error: Content is protected !!