Health benefits of Tulsi Holi Basil Benefits

తులసి ఆకులు ఎలా తీసుకోవాలి మింగితే మంచిదా తింటే మంచిదా నమ్మలేని నిజాలు

తులసి మొక్కను ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మొక్క గా పేర్కొంటారు. తులసి మొక్కలు చాలా ఔషధ గుణాలు ఉంటాయి.  తులసి మొక్కలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్యాలు నయం చేసే లక్షణాలు ఉన్నాయి.విష, ఆహార, మలేరియా వంటి రుగ్మతలను నయం  చేసే గుణాలు ఉన్నాయి.

తులసి ఆకులు నాడులకు టానిక్ గాను, జ్ఞాపక శక్తి పెంచే విధానం గా తోడ్పడతాయి. అయితే తులసి ఆకులను తినేటప్పుడు కొంతమంది కొన్ని సందేహాలు చెప్తూ ఉంటారు. తులసి ఆకులు నమిలి తినొచ్చా లేక మింగాల అనే సందేహాలు ఉంటాయి. తులసి ఆకులు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వాటిని మింగుతూ ఉంటారు. 

తులసి ఆకులు చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రోజు  రాత్రులు నాలుగు నుండి ఐదు  ఆకులు  శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున వీటితోపాటు ఆకులను కూడా  మింగితే మంచిది లేదా ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి నీరు వడకట్టుకోవాలి. ఆ నీటిని త్రాగడం వలన మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.  తులసి ఆకులలో ఐరన్, పాదరసం ఎక్కువగా ఉంటాయి. 

తులసి ఆకులను రోజు  నమలడం వలన  పళ్లపై ఉండే ఎనామిల్ పొర పోయి,  పళ్ళు పాలిపోయే అవకాశం ఉంది.  అందుకే తులసి ఆకులను మింగడం లేదా నీటిలో  మరిగించి నీటిని తాగడం ఉత్తమం. తులసి ఆకులు తినడం వలన గొంతు నొప్పి, గొంతులో గరగర తగ్గుతాయి.  తులసి ఆకులు సీజనల్ డిసీజెస్ ను తగ్గిస్తాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు తులసి ఆకులు పేస్ట్ చేసి  నుదురు మీద రాయడం వలన తలనొప్పి తగ్గుతుంది. తులసి ఆకుల వలన దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. 

తులసి ఆకులు పంటి నొప్పిని కూడా తగ్గిస్తాయి.  తులసి ఆకుల రసం తీసి రెండు చుక్కలు చిన్నపిల్లలకు  పట్టినట్లయితే  కఫం తగ్గుతుంది.  తులసి ఆకు వలన చాలా కలిగే ప్రయోజనాలు ఉన్నాయి.  తులసి చెట్లు ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకుంటారు.  తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో  స్నానం చేసినట్లయితే చర్మ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి.  తులసి ఆకులను నమలడం కంటే నీటిలో మరిగించి లేదా రసం తీసుకుని త్రాగడం వలన  పళ్లపై ఎనామిల్ పొర పోదు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

Leave a Comment

error: Content is protected !!