Health Benefits Of Vitamin A Foods

విటమిన్ ఏ గూర్చి కొన్ని నిజాలు తప్పక తెలుసుకోండి.

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఎన్ని ఉన్నా, ఆరోగ్యం లేకపోతే మాత్రం అన్ని వృధానే. ఆరోగ్యంగా ఉంటే అడవిలో అయినా బతికేయగలడు, మనిషికే కాదు ప్రపంచములో ప్రతి జీవికి ఆరోగ్యమే ముఖ్యమైనది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఏ జబ్బు వచ్చినా వెంటనే చికిత్స తీసుకోవాలి. అయితే మనం తినే ఆహారంలో కొన్ని విటమిన్స్ ఉంటాయి, కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. అలాంటి విటమిన్స్ లో ఒకటైన విటమిన్-ఎ గూర్చి ఎంతమందికి ఎన్ని నిజాలు తెలుసు. ప్రతి ఆహార పదార్థం పుష్టిగా మెక్కడం తప్పా….. ఆ ఆహారంలో ఉండే విటమిన్ ఏది??  ఆ విటమిన్ లోపం వల్ల కలిగే సమస్యలు ఏమిటి?? తెలుసుకుందాం మరి.

విటమిన్-ఎ రసాయన నామం “రెటినాల్”. ఇది కొవ్వులో కరిగే విటమిన్. మన దేశంలో సుమారు  మూడు శాతం మంది పిల్లలు విటమిన్-ఎ లోపం కారణంగా కలిగే  బిటాట్ స్పాట్ ( తెల్లని కనుగుడ్డుపై నల్లని మచ్చ ఉండటం) అనే సమస్య తో బాధపడుతున్నారు. విటమిన్ ఎ లోపం తొలిదశ లక్షణాల్లో రేచీకటి మొదటిది. అనారోగ్యాన్ని ఎదుర్కోవడానికి, దృష్టి దోషాలను నివారించడానికి పిల్లలకు విటమిన్-ఎ చాలా అవసరం. పసిపిల్లలకు 6 నెలల వయసు వచ్చేవరకు తల్లిపాల నుండి విటమిన్-ఎ లభిస్తుంది. శరీరానికి కావలసిన విటమిన్స్ లో విటమిన్-ఎ కూడా ప్రధానమైనది.

విటమిన్-ఎ లభించే ఆహార పదార్థాలు: 

బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మన ప్రధాన ఆహారంలో భాగమైన పాలలో విటమిన్ ఎ పొందవచ్చు. అలాగే పాల ఉత్పత్తులు అయిన వెన్న, నెయ్యి, పెరుగు నుండి కూడా విటమిన్-ఎ లభిస్తుంది. తల్లిపాలు, మామిడి పండ్లు, బొప్పాయి క్యారెట్, వెన్న, గుడ్డు సొన మొదలైన వాటిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ ఆకుకూరలలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. మొక్కలలో విటమిన్ ఎ బీటాకేరోటిన్ రూపంలో ఉంటుంది. ఆకుకూరలు మనం తీసుకున్న తరువాత కాలేయం, పేగులలో విటమిన్ ఎ గా  మార్పు చెందుతుంది. 

విటమిన్-ఎ ఉపయోగాలు: 

మన శరీర నిర్మాణానికి ముఖ్య కారణమైన కణజాలాలు ఉత్తేజంగా ఉండటానికి, మరియు  కణజాలం పెరుగుదలకు విటమిన్ ఎ దోహాధం చేస్తుంది. కంటి చూపు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్-ఎ చాలా అవసరం.  కంటి నేత్ర పటలంలో రోడాప్సిస్ పునఃసంశ్లేషణకు ఇది అత్యవసరం.  చర్మకణాలు నిగనిగలాడేట్టు, మృదువుగా ఉండేట్టు చేసేందుకు ఉపయోగపడుతుంది.

విటమిన్ ఎ లోపం వల్ల వచ్చే సమస్యలు:

రేచీకటి, జీరాప్తాల్మియా, కెరటో మలేసియా, బైటాట్ స్పాట్శ్, ప్రీనోడేర్మా మొదలైన సమస్యలు వస్తాయి.

విటమిన్ ఎ ఆరోగ్యకరమైన పద్ధతిలో పొందాలని అనుకుంటే తాజా క్యారెట్ మరియు ఆకు కూరలు పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్ ఎ లోపం ఉన్న వారు. క్యారెట్ ను నేరుగా తినడం లేదా క్యారెట్ జ్యుస్ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే ఉత్తమ ఫలితాల కోసం కనీసం ఒక నెలరోజుల పాటు తీసుకోవాలి.

చివరగా……

విటమిన్ ఎ అనేది నూనెలో కరిగే విటమిన్ కాబట్టి ఇది శుద్ధమైన, స్వచ్ఛత గల నూనెలో కూడా ఉంటుంది. అందువల్ల వంటకు వినియోగించే నూనె ఎంపిక విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా గానుగ నూనె చాలా శ్రేష్ఠమైనది.

Leave a Comment

error: Content is protected !!