health beneftis of ash gourd juice

1 గ్లాస్ తాగితే చాలు కీళ్ళ నొప్పులు,కిడ్నీలో రాళ్ళు, కొలెస్ట్రాల్, కంటిచూపు బలహీనత, ఎసిడిటీ, ఊబకాయం తగ్గిస్తుంది

హలో ఫ్రెండ్స్ మనకి ప్రకృతి సహజంగా లభించే కూరలు కానీ పండ్లలో ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ ఖనిజాలు ఉంటాయి అలాంటిదే ఈ గుమ్మడికాయ. గుమ్మడి కాయ గురించి మన భారతీయులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గుమ్మడి ఘుమఘుమలు లోని వంటిల్లు ఉండదు గుమ్మడి పండు తగిలించండి తెలుగు ఉండదు. మన ఆచార సాంప్రదాయాల నుండి వంటకాల వరకు తనకంటూ ఒక ప్రత్యేకతను ఈ గుమ్మడకాయి కలిగి ఉంటుంది. గుమ్మడి కాయలు చాలా రకాలు ఉంటాయి. అందులో ఈ రోజు తెల్లగా ఉంటే బూడిద గుమ్మడికాయ గురించి తెలుసుకుందాం.

దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయను మనం ఇంటి ద్వారానికి కడుతూ ఉంటాం. చాలామంది కేవలం దీన్నిదిష్టి  తీయడానికి మాత్రమే అని అనుకుంటారు. కానీ మన సాంప్రదాయ ఆయుర్వేదంలో గుమ్మడికాయలు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అధిక పోషక విలువలు కలిగిన ఈ గుమ్మడికాయలో కొలెస్ట్రాల్ సోడియం ఫ్యాట్ తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి సరైన మోతాదులో పోషకాలను అందించటమే కాకుండా ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ప్రతి రోజు మీరు కనుక ఒక గ్లాసు గుమ్మడి కాయ జ్యూస్ తాగితే మీ శరీరంలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పూర్తి వివరాలకు ఈ వీడియోని చూడండి.

బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తయారీ విధానం

ముందుగా గుమ్మడికాయ ని కట్ చేసుకుని అందులోని లోపలి భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని జ్యూస్లా గా చేసుకోండి. తర్వాత ఈ జ్యూస్ ని వడగట్టుకుని తాగొచ్చు. లేదా కొద్దిగా తేనెను కలుపుకొని కూడా తాగవచ్చు.

ఈ గుమ్మడికాయ చూసిన రోజు పరగడుపున తీసుకుంటూ ఉంటే శరీరంలో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ కాలరీలు కరుగుతాయి. కొద్ది రోజుల్లోనే బరువు తగ్గడాన్ని మీరే గమనిస్తారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మీ ఆకలిని నెమ్మది నెమ్మదిగా తగ్గేటట్టు చేస్తుంది. జీర్ణశక్తిని రెట్టింపు చేసి మీ కొలెస్ట్రాల్ కరిగే టట్లు చేస్తుంది.

ఈ గుమ్మడి కాయ జ్యూస్ లో ట్రిప్టోఫాన్ అను పిలవబడే ఎమినో యాసిడ్ ఉంటుంది. ఇది ఒత్తిడి ఆందోళన తో పోరాడి డిప్రెషన్ను తగ్గిస్తుంది. మీరు కనుక డిప్రెషన్ మానసిక సమస్యలతో బాధపడుతుంటే ప్రతి రోజు ఈ జ్యూస్ ను తప్పకుండా తీసుకోండి.

గుమ్మడికాయ తొక్కలను లేదా  గింజలను కొబ్బరినూనెలో మరిగించి ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు రాస్తే మీ జుట్టు మృదువుగా మెత్తగా మారి మీ వెంట్రుకలు ఊడిపోకుండా బాగా పెరుగుతాయి. చిన్నపిల్లలు మలబద్ధకం, పొట్టలో నులిపురుగులతో  బాధపడుతూ ఉంటే ఈ గుమ్మడి కాయ విత్తనాలను పొడిలా చేసుకుని పాలలో కలుపుకుని తాగితే పొట్టలో పురుగులు క్రిములు నశించి పోతాయి.

Leave a Comment

error: Content is protected !!