వర్షాకాలం అనగానే రహదారుల మీద బురదబురదగా నిలిచిన వర్షపు నీళ్లు దానిమీద తిరిగే దోమలు ఈగలు గుర్తొస్తాయ్. వాతావరణ మార్పుల వల్ల శరీర ఇమ్యూనిటీ బలహీనపడి జ్వరం, జలుబు, దగ్గుతో పాటు స్వైన్ ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడాల్సి వస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలతో వీటికి చెక్ పెట్టొచ్చు. ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జ్వరం దగ్గు జలుబు వస్తే కరోనా అని భయపడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మరింత జాగ్రత్త అవసరం.
వర్షాకాలంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు.
◆ ఇంటిని, చుట్టూ పరిసరాలను వీలైనంతవరకు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడున్న కరోన ప్రభావం వల్ల చేతులు, కాళ్ళు కడుక్కోవడం వంటివి అలవాటు అయ్యాయి అయితే కేవలం ఇలా చేయడమే కాదు ఏ వర్షం ద్వారా అయితే ఇన్ఫెక్షన్లు వస్తాయో అదే వర్షానికి దూరంగా ఉండటం ప్రధానం.
◆శుభ్రమైన నీరు మరియు ఆహారం. ఈ విషయాల్లో ఎలాంటి కాంప్రమైజ్ అవకండి. ప్రతి ఇంట్లో వాటర్ ఫూరిఫైయర్ లు ఉండవు అలాగని కుళాయిల్లో వచ్చే నీరు తాగలేం, బయట కొనే మినరల్ వాటర్ క్యాన్ లు కూడా వారు తీసుకొచ్చే విధానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీటి విషయం లో సమస్య తీరాలంటే నీటిని వేడి చేసి తరువాత చల్లార్చుకుని తాగాలి. ఇక ఆహారం విషయం లో వేడి వేడి గా తినడం ముఖ్యం. అలాగే బయట నుండి తెచ్చుకునే ఆహార పదార్థాలకు దూరం గా ఉండటం మంచిది. పక్కింట్లో, ఎదురింట్లో ఇచ్చారని మోహమాటంతో తీసుకుని తినకుండా వాతవరణంకు అనుగుణంగా మీ మోహమాటన్ని కూడా వదిలేయడం ఉత్తమం. అలాగే వర్షానికి పెరిగిన ఆకుకూరలు కూరగాయలు కూడా తాజాగా ఉన్నపుడే వాటిని బాగా కడిగి తరువాత వండుకోవడం ఉత్తమం.
◆ రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి షాపింగ్ చేయాలనుకునే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ధరించే దుస్తులను కూడా కాలానికి అనుగుణంగా వేసుకోవాలి కానీ ఫాషన్ పేరిట ఇబ్బందులు పడకండి.
◆ మనకు పగలు ఎంత ముఖ్యమైనదో రాత్రి కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రతి ఒక్కరికి 8 గంటల నిద్ర తప్పనిసరి అవసరం. నిద్రను నిలక్ష్యం చేయకపోతే ఆరోగ్యం మనతోనే ఉంటుంది.
ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు
వర్షాకాలంలో సహజంగానే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఫలితంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరం, గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలు వచ్చిపడతాయి. అయితే ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

కోడిగుడ్డు
కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్, విటమిన్ ఎ, డి ఉంటాయి. ఎగ్‌వైట్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను అడ్డుకునేందుకు తోడ్పడతాయి.
గ్రీన్ వెజిటబుల్స్
పాలకూర, మెంతి, బ్రోక్కొలి, మునగాకులు…వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫోలికాసిడ్, ఐరన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. వారంలో కనీసం మూడురోజులు వీటిని తీసుకుంటే ఇమ్యూనిటీకి ఢోకా ఉండ దు.
స్వీట్‌కార్న్
వీటిలో విటమిన్ బి12, ప్రొటీన్స్, ఫైబర్ అధికంగా లభిస్తాయి. సలాడ్, సూప్స్ రూపంలో ఇతర డిష్‌లతో కలిపి తీసుకున్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది.
కందగడ్డ
విటమిన్ ఎ అత్యధికంగా లభించేది ఇందులోనే. అంతేకాకుండా ఫోలికాసిడ్, ఫైబర్ కూడా లభిస్తుంది. వారంలో రెండు రోజులు తిన్నా చాలు.
నట్స్
వాలనట్స్, బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి వాటిని ఎక్కువగా తినాలి. వీటిలో ఉండే ప్రొటీన్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్ ఇమ్యూనిటీని పెంచుతాయి.
తులసి
కాల్షియం, పొటాషియం, జింక్, యాంటీకేన్సర్ గుణాలుంటాయి. గ్రీన్‌టీ రూపంలో తీసుకోవచ్చు. సలాడ్స్‌తో కలిపి తీసుకోవచ్చు.
అల్లం
జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను తరిమేయడానికి అల్లం ఉపకరిస్తుంది. లెమన్ జ్యూస్‌తో కలిపి తీసుకుంటే ఫలితం బాగుంటుంది.
ఉసిరి
ఇమ్యూనిటీని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు వంటివి దరిచేరకుండా చూస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు అడ్డుకట్ట వేస్తుంది. మగువల శక్తిని చాటారు.
చివరగా……
ఈ వర్షాకాలం అంతా జాగ్రత్తగా ఉండి పై సూచనలు పాటిస్తూ తాజా ఆహారాన్ని తీసుకుంటూ రాజాలా సంతోషంగా ఉండండి మరి.