Healthy and Tasty Pulao Matar Paneer Semiya Pulao Recipe

ఈ పులావ్ ఎంత తిన్నా తనివి తీరదు…… మళ్లీ మళ్లీ దీన్ని చేసుకోవాలి అనిపిస్తుంది…….. మటర్ పన్నీర్ సేమియా వెజిటేబుల్ పలావ్…

 సాధారణంగా పలావ్ తయారు చేసుకుంటే అందులో పనికొచ్చేవి కేవలం బటాని, పన్నీర్ వంటివి కొన్ని మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ పనికిరాని మసాలాలు, హాని కలిగించే నూనె, ఉప్పు, కారాలు ముఖ్యంగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే పలావ్ ఈ రకమైన పలావ్ లో టమాటా జ్యూస్ లు గాని, కొబ్బరిపాలు గాని ఇలాంటివన్నీ వేసి తయారు చేస్తాము. వీటి యొక్క కాంబినేషన్ వలన హెల్తీగా ఉప్పు, నూనె లేకుండా టేస్టీగా చేసుకునే టెక్నికులు ఇన్ని లాభాలు కలిగించే విధంగా ఉంటాయి.

                        కాబట్టి ఎప్పుడైనా రుచికరంగా ఇలాంటి హెల్తీ వాటిని తయారు చేసుకుంటే ఆరోగ్యకరంగా ఉండవచ్చు. మటర్ పన్నీర్ సేమియా పలావ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది వన్ అండ్ ఆఫ్ కప్ సేమియా, కొబ్బరి పాలు ఒక కప్పు, పచ్చి బఠాణి హాఫ్ కప్, పన్నీర్ ముక్కలు ఒక కప్పు, క్యారెట్ ముక్కలు హాఫ్ కప్పు, బీన్స్ ముక్కలు హాఫ్ కప్, జీడిపప్పులు పావు కప్పు, పుదీనా పావు కప్పు, పచ్చిమిర్చి ఐదు, ఆరు, అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్లు, మీగడ వన్ టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు ఒకటి, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు మూడు, యాలకులు రెండు.

                      ముందుగా నాన్ స్టిక్ పాత్రలో సేమ్యాలను దోరగా వేయించుకోవాలి. తర్వాత పచ్చి బఠానీలు కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా చేస్తే పచ్చిబఠానీ గుల్లగా ఉంటాయి. ఇప్పుడు పలావ్కి గిన్నె పెట్టుకుని అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి తర్వాత బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అల్లం తురుము వేసి, మీగడ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో జీడిపప్పు, పన్నీరు, పుదీనా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేసి కొద్దిగా నీరు పోసి బాగా మరగనివ్వాలి.

                              తర్వాత వేయించుకున్న సేమియా వేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పలావ్ బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఇందులో నిమ్మరసం, పచ్చిబఠానీ వేసి కలుపుకొని దించుకోవాలి. ఇలా మటర్ పన్నీర్ సేమియా పలావ్ అయిపోతుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరియు హై ప్రోటీన్ పలావ్

Leave a Comment

error: Content is protected !!