Healthy Banana Liver Curry Increases Body Strength

పచ్చి అరటికాయతో ఇలా చేసుకుంటే మహాబలం…

కూరగాయలలో  అతి బలమైన కూరగాయ అరటికాయ. 100 గ్రాములు పచ్చ అరటికాయలో 90 క్యాలరీల శక్తి ఉంటుంది. అలాంటి అరటికాయని సెనగపిండి వేసి వెజిటేబుల్ కాంబినేషన్ ఎక్కువ ఇచ్చి లివర్ కర్రీ స్పెషల్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బనానా లివర్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. పచ్చి అరటికాయలు రెండు, పెరుగు ఒక కప్పు, శనగపిండి 1/2 కప్పు, పచ్చిమిర్చి ఐదు ఆరు, నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్, అల్లం తురుము వన్ టేబుల్, స్పూన్ సోంపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర వన్ టేబుల్ స్పూన్, ఆవాలు వన్ టేబుల్ స్పూన్, సాంబార్ మసాలా వన్ టీ స్పూన్, మీగడ వన్ టీ స్పూన్, వంట సోడా కొద్దిగా తీసుకోవాలి.

              పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి. ముందుగా పచ్చి అరటికాయని తీసుకొని తొక్క తీసి తురుముకోవాలి. ఈ అరటి తురుమును ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొద్దిగా పసుపు, సాంబార్ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొత్తిమీర శనగపిండి వేసేసి వంట సోడా వేసి, నిమ్మరసం కూడా వేసి, పెరుగు కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మీగడ అప్లై చేసిన ట్రే లో ఒక అట్టు లాగా వేసేసుకొని మూత పెట్టేసి ఆవిరిలో ఉడికించుకోవాలి. ఇక ఉడికిన తర్వాత తీసేసి కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన లివర్ ముక్కలను పక్కన పెట్టుకొని కర్రీ  కోసం తాలింపు సిద్ధం చేసుకోవాలి.

              ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి సోంపు, కరివేపాకు, మీగడ వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా అల్లం తురుము, పసుపు, సాంబార్ పొడి, మిరియాల పొడి, టమోటా పేస్ట్ వేసేసి దానిలో కొద్దిగా పెరుగు వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. దీనిలో అరటికాయలు లివర్  ముక్కల్ని వేసి చివరగా తేనె కొంచెం యాడ్ చేస్తే ఉప్పులేని లోటు తెలియదు. కొత్తిమీర పైన చల్లుకుంటే అరటికాయ లివర్ కర్రీ తయారైపోయింది. మామూలుగా ఇలాంటి కర్రీస్ లో గ్రేవీ కోసం చింత పండు గుజ్జుని ఎక్కువగా పోస్తారు. దానికి బదులుగా టమాటా గుజ్జుని వేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. కాబట్టి అందరూ తప్పకుండా ఈ కర్రీ నీ ట్రై చేయండి.

Leave a Comment

error: Content is protected !!