మన శరీరంలో రక్తాన్ని తీసుకువెళ్లడానికి రక్తనాళాలు పనిచేస్తూ ఉంటాయి. మన ఇంట్లో నీళ్లను పంప్ చేయడానికి నీళ్ల ట్యాంక్ ఉన్నట్టే, మన శరీరంలో రక్తాన్ని పంప్ చేయడానికి మన శరీరంలో కూడా టాంక్ ఉంది. అదే గుండె. మనం తినే చెడు ఆహారపు అలవాట్లు వలన చేరిన కొవ్వులు వలన, మన శరీరంలో పేరుకున్న మలినాలు వలన చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.
ఈ మలినాలు, కొవ్వు మన రక్తనాళాలలో పేరుకుపోతూ ఉంటుంది. అప్పుడు ఇవి కొద్దికొద్దిగా మన రక్తనాళాలను మూసివేస్తాయి. ఇలా జరగడం వలన మనకు సడన్గా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. గుండె ఆగిపోయి హార్ట్ ఎటాక్ వస్తోంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వలన వందకు పైగా జబ్బులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగకపోతే ముఖ్యమైన భాగాలైన గుండె, ఊపిరితిత్తులు, లివర్ వంటి భాగాలు సరిగ్గా పని చేయవు. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వలన ఆక్సిజన్ కూడా అందదు. క్రమంగా అవయవాల పనితీరు తగ్గిపోతుంది. అందుకే రక్తాన్ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
మంచి ఆహారపు అలవాట్లకు మారడంతో పాటు ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేద చిట్కాని ప్రయత్నించడం వల్ల రక్తంలోని విషపదార్థాలను బయటకు పంపడంతో పాటు కొవ్వు, మలినాలను కూడా తొలగిస్తుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగక పోవడం వల్ల మన కిడ్నీలు కూడా సరిగ్గా పనిచేయకపోవడం, అలసటగా అనిపించడం, జుట్టు రాలిపోవడం, పనిపై ఏకాగ్రత లేకపోవడం ఇంకా అనేక అనారోగ్యాలు కలుగుతాయి.
దీనికి చికిత్సకోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు 4. అవి ఒకటి సొరకాయ కొత్తిమీర పుదీనా మరియు తులసి మొదట సొరకాయ జ్యూస్ చేసుకొని అందులో కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీ పట్టాలి. ఈ జ్యూస్ రోజూ తాగడం వలన రక్తంలోని కొవ్వు మరియు మలినాలు తొలగిపోతాయి.
రక్తంలోని విషపదార్థాలను తొలగించడం వల్ల కిడ్నీ, లివర్ చక్కగా పనిచేస్తాయి. ఇలా అప్పుడప్పుడు రక్తాన్ని నిర్విషీకరణ చేయడం వలన శరీరంలో వందకుపైగా రోగాలకు దూరంగా ఉండవచ్చు. దీనితోపాటు తగినంత నీళ్ళు తాగడం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్ మసాలాలకు దూరంగా ఉండాలి. ఇవన్నీ శరీరంలో కొవ్వు పేరుకోకుండా గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.