Healthy Food to Cure Piles Hemorrhoids Home Remedies

ఇలాచేస్తే చాలు నొప్పి లేకుండా ఎంతటి భయంకరమైన మొలలు,పైల్స్ సైతం శాశ్వతంగా మాయం జన్మలో మళ్ళీ రావు..

సహజంగా జరగవలసిన దానికంటే తక్కువగా మలవిసర్జన జరగడం, కష్టంగా జరగడం వలన కొంతమంది మలవిసర్జన చెయ్యాలంటే కూడా భయపడుతుంటారు. దీనినే మలబద్దకం అంటారు. మలవిసర్జనలో రక్తం పడడం, నొప్పి ఉండి  అన్నవాహిక చివర నుండి మలద్వారానికి చివర పొడుచుకు వచ్చిన (అంతర్గతంగా కూడా ఉండొచ్చు) రక్తనాళాలను మొలలు (హెమరాయిడ్స్) అంటారు. 

ఈ సమస్యకు ప్రధాన కారణం మన జీవనవిధానంలో వచ్చిన మార్పులు, ఆహారంలో వచ్చిన మార్పులు,  మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, నీళ్ళు తక్కువగా తాగడం, వేపుడు, మసాలా పదార్థాలు, మద్యపానం, ధూమపానం, ఒత్తిడితో ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. తినే ఆహారంలో పీచుపదార్థాలు తగ్గిపోవడం కూడా సమస్యకు కారణమవుతుంది. హార్మోన్లలోని తేడాలువలన పురీషనాళంలోని  రక్తనాళాలు దెబ్బతినటం, గర్భవతుల్లో గర్భకోశం విస్తరించడం వలన ఒత్తిడి పెరిగి రక్తనాళాల పరిమాణంలో తేడాలు వలన మొలలు పెరిగే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

వీటిని ఆపరేషన్తో తొలగిస్తారు. కానీ ఆహార జీవనవిధానంలో మార్పులు చేయకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అలాగే గర్భవతుల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంది.  ఈ సమస్యతో బాధపడేవారికి ఇంటిచిట్కాలతో కూడా పరిష్కారం లభిస్తుంది.

 వాటికోసం మనం ఎక్కువగా ఖర్చుపెట్టాల్సిన పని కూడా లేదు. అవన్నీ మన వంటగదిలోనే ఉంటాయి. అవేంటో చూద్దాం.

పొయ్యి పై  గ్లాసున్నర నీళ్ళుపెట్టుకొని అందులో రెండు చెంచాల ధనియాలు వేసుకోవాలి. ఆ నీళ్లు బాగా మరిగి గ్లాసు అయ్యేంతవరకూ ఉంచి వడకట్టుకోవాలి. దీనిలో పటికబెల్లం రుచికి తగినంత కలుపుకొని టీలా తీసుకోవాలి. వీలయినంత వరకూ పరగడుపున తీసుకోవడం మంచిది. లేదంటే ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత తీసుకోవాలి. ఇది రోజూ రెండు సార్లు తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడి మలబద్దకం తగ్గుతుంది. 

అలాగే శరీరానికి  ధనియాలు, పటికబెల్లం చలువ చేసి మొలలు తగ్గేలా చేస్తాయి. తిన్న ఆహారం జీర్ణమవక ప్రేగులకు అంటుకుపోయి మలవిసర్జన కష్టమవుతుంది. అలాకాకుండా రోజూ ఈ ద్రవం తాగినట్లయితే మలవిసర్జన మామూలుగా జరిగి రక్తం పడడం, నొప్పి, దురద లాంటివి కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే మొలలు ప్రారంభదశలో ఉంటే మూడురోజుల్లోనే ఈ ద్రవం తగ్గిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!