Healthy Gravy Curry at Home Tasty Dahi Baingan Recipe

సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా హానిలేని విధంగా తయారు చేసుకునే వంకాయ పెరుగు కూర……

వంకాయ ఇష్టపడనివారు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే నూనె, ఉప్పు బాగా పీల్చుకొని మసాలా వేస్తే ఎక్కడ లేని గుమగుమలాడే రుచి, వాసన వస్తుంది. ఇంత రుచికరమైన వంట మన ఆరోగ్యానికి హానికరం. కాబట్టి హాని లేనివిధంగా వంకాయలో పెరుగు వేసి ఉప్పులేని లోటును భర్తీ చేసే విధంగా చేసుకునే వంకాయ పెరుగు కూర ఎవరైనా సులువుగా తినే విధంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఏమాత్రం హాని చేయదు. కీళ్ల నొప్పులు ఉన్న, చర్మ వ్యాధులు, ఎలర్జీలు ఉన్న ఎవ్వరికి వాతం అనే మాట రాకుండా వంకాయని ఈ విధంగా వండితే ఎవరైనా తినవచ్చు.

                     ఇప్పుడు వంకాయ పెరుగు కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. 1. సన్నగా కోసుకున్న వంకాయ ముక్కలు, 2. పుల్లటి పెరుగు ఒక కప్పు, 3. ఉల్లి ముక్కలు అర కప్పు, 4. కొబ్బరి తురుము అర కప్పు, 5. వేరుశనగ పప్పులు పావు కప్పు, 6. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 7. పచ్చిమిరపకాయలు మూడు, 8. ఎండు మిరపకాయలు రెండు, 9. జీలకర్ర ఒక స్పూన్, 10. ఆవాలు ఒక స్పూన్ 11. మెంతులు ఒక స్పూన్, 12. ఇంగువ కొద్దిగా.13. జీలకర్ర పొడి వన్ స్పూన్, 14. పసుపు తగినంత, 15. కరివేపాకు రెండు రెమ్మలు, 16. కొత్తిమీర కొద్దిగా, 17. మీగడ వన్ స్పూన్.

                     ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో ఒక స్పూన్ మీగడ వేసుకుందాం. అందులో ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పసుపు, ఎండుమిరప ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా ఇంగువ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇలా వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత టమాటో పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ లో వంకాయల్ని ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతూ ఉండగా పెరుగు గ్రేవీ తయారు చేసుకోవాలి.

                     దీనికోసం ముందుగా సన్నని సెగపై వేరుశనగ పప్పులు, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా చేసి తర్వాత అందులో పెరుగు వేసుకోవాలి. తయారైన పెరుగు గ్రేవీని ఉడికిన వంకాయ ముక్కల్లో వేయాలి. ఈ గ్రేవీ వంకాయ ముక్కలు పట్టడానికి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించుకోవాలి. వంకాయ పెరుగు కర్రీ తయారవుతుంది..

Leave a Comment

error: Content is protected !!