Healthy Habits and Staying Active This Winter

ఈ అలవాట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

విలువైన జీవితంలో ఆరోగ్యం చాలా గొప్పది.  శరీరం సరైన స్థితిలో లేకుంటే అనారోగ్యం దరిచేరి శరీరాన్ని దాని ప్రభావ పరంగా జీవితాన్ని కూడా అస్తవ్యస్తం చేస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఎదో ఒక అనారోగ్యం వేధిస్తూనే ఉంది. అయితే కొన్ని పాటించడం వల్ల మన ఆరోగ్యం జీవితం ఎంతో ఆనందంగా ఉండేలా మనమే చేసుకోవచ్చు. అయితే అవేంటో ఒకసారి చూద్దాం.

◆ఆరోగ్యానికి మొదటి మెట్టు ఉదయం మనం నిద్ర లేచే సమయమే. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అనేది మన పెద్దలు పాటిస్తూ వచ్చిన గొప్ప అలవాటు. అందుకే వారి జీవితకాలం ఎంతో గొప్పగా కొనసాగింది. ప్రతి ఒక్కరు సూర్యోదయానికి కనీసం అరగంట నుండి గంట  ముందువ నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి.

◆ఉదయపు నడక, వ్యాయామం, యోగ, ధ్యానం వంటివి ప్రతిరోజు ఉదయం చేయడం మొదలు పెట్టాలి. దీనివల్ల శరీరం రోజంతా ఉల్లాసంగా ఉండేలా సన్నద్ధమవుతుంది.

◆వారానికి రెండు సార్లైనా ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయడం వల్ల దేహ దారుడ్యం మెరుగుపడుతుంది. మహిళల్లో శరీరం మంచి నిగారింపును అవయవ సౌష్టవాన్ని మెరుగుపరుస్తుంది.

◆ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయంలో ఆ లేత కిరణాలు శరీరంపై పడేలా జగ్రత్త తీసుకోవాలి. వీలైనవారు సూర్యనమస్కారాలు చేయడం అత్యుత్తమం.

◆ప్రాణాయామం, కపాలభీతి వంటి యోగా ప్రక్రియలను పాటించడం ద్వారా శరీరంలో రోగనిరోధక పెరిగి ఆరోగ్యం పెంపొందుతుంది.

◆ప్రతిరోజు మనిషి చేస్తున్న పనులు, వ్యాయామం వీటికి అనుగుణంగా శరీరానికి సరైన పోషకాలు కూడా అందించాలి.  ద్రాక్ష, వెన్న, కోడిగుడ్డు, ఇడ్లి, వేడి పాలు, లేక నిమ్మరసం కలిపిన నీళ్లు వంటివి పరగడుపున తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా తయారవుతుంది. శరీరాన్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది.

◆వీలైనంతవరకు మీ చుట్టూ గాలి వెలుతురు ఉండేట్టుగా చూసుకోవాలి. చుట్టూ వున్న వాతావరణాన్ని వీలైనంత వరకు ఆహ్లాదంగా ఉంచుకోడానికి ప్రయత్నించాలి. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

◆ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేలా మానసిక వత్తిడిని నెత్తికెత్తుకోకూడదు. ఇది డిప్రెషన్ కు దారి తీస్తుంది. 

◆బయటి ఆహారపదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యానికి మూల సూత్రం కూడా బయటి ఆహారానికి దూరంగా ఉండటమే.

◆అసందర్బపు చర్చలు, అనవసర విషయాల గూర్చి ఆలోచనలు చేయడం మానేయడం ఉత్తమం. దీనివల్ల సమయాన్ని మీకు అనుగుణంగా మార్చుకోవడమే కాకుండా వివాదాలకు దూరంగా కూడా ఉండవచ్చు. దీనివల్ల మానసిక ప్రశాంతత మీ సొంతమవుతుంది.

◆ ధూమపానం మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. అతి పులుపు, అతి ఉప్పు, అతి కారం, అతి మసాలా వంటి వాటికి దూరంగా ఉండాలి.

◆భోజన వేళలు తప్పనిసరిగా పాటించాలి. తినగానే నిద్రపోవడం చాలా మంది అలవాటు దాన్ని మానుకోవాలి. తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. పండ్లు పళ్ళ రసాలు, ఆకుకూరలు, తృణధాన్యాలు మొదలైనవాటికి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

◆ఉదయం లేవడం అనేది ఎలాగైతే ముఖ్యమో, అలాగే రాత్రి నిద్ర కూడా అంతే ముఖ్యం. రాత్రి 10 గంటల లోపు నిద్రపోవడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

చివరగా…..

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పైన చెప్పుకున్నవి పాటిస్తూ వ్యక్తులతో ఆరోగ్యకరమైన సత్సంబంధాలు మైంటైన్ చేసుకోవాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత, దానితో ఆరోగ్యం కూడా  సొంతమవుతుంది.

Leave a Comment

error: Content is protected !!