అమ్మాయికి అందంమైన రూపంతో పాటు,మంచి ఆకృతిలో ఉండే గోళ్ళు,నాజుకైనా వేళ్ళు అంటే ఇష్టం. ఇవి తన అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే బ్యూటీ పార్లర్’కి వెళ్ళిన ప్రతీసారి అమ్మాయిలు పెడిక్యూర్, మ్యానిక్యూర్ చేయించుకుంటారు. కాని అదే పనిగా బ్యూటీ పార్లర్ కి వెళ్ళలేము. ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
అమ్మాయిలు అంటేనే ఇంటిపని,వంట పని ఉంటాయి. పెళ్ళైన మహిళలైతే,ఇంట్లో బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇక ఇతర పనులులతో వారి చేతి వేళ్ళు, గోళ్ళు నీటిలో పాడవుతుంటాయి. ఎక్కువ నీటిలో నానడం వలన గోళ్ళు విరిగిపోతుంటాయి. ఇలా జరగకుండా ఎలా చూసుకోవాలి.
- పనులు పూర్తవగానే, మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
- ఆలివ్ ఆయిల్ తో తరచూ మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల గోళ్ళకు తేమ అంది మృదువుగా ఉంటాయి.
ఉతికే బట్టల పౌడర్ కానివ్వండి,లేదా అంట్లు తోమే లిక్విడ్ ఏదన్నా, రసాయనాల ప్రభావంతో గోళ్ళు పసుపు పచ్చగా మారి,తరుచు విరుగుతుంటాయి. దీనికి కారణం సరైన పోషక ఆహరం తినకపోడమే.
Read Also అందమైన కళ్ల కోసం
- ఆహారంలో ఆకుకూరలు, బీన్స్, మొలకలు, గుడ్లు, వంటి పదార్ధాలు ఎక్కువ తీసుకోవాలి.
- రాత్రిపూట పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళల్లో రెండు చుక్కల నిమ్మరసం,కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ వేసి, దానిలో మీ వేళ్ళని నాన నివ్వాలి.ఇలా చేస్తే, గోళ్ళకి బలం చేకూరడంతో పాటు, పసుపు రంగు కూడా తగ్గుతుంది.
చేతులూ,గోళ్ళు మురికిగా ఉన్నప్పుడు నిర్జీవంగా తయారవుతాయి. అవి పాడైపోయే సమస్య కూడా తలెత్తుతుంది.
- గోళ్ళని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
- రోజు కాసేపు బాదం నూనెలో కొద్దిగా పంచదార కలిపి చేతికి, వేళ్ళకి, గోళ్లకి మసాజ్ చేయడం మంచిది.