Healthy Recipe to Improve Digestion Power

పొట్టలో గ్యాస్ట్రిక్, అజీర్ణం సమస్యలను తక్కువ టైంలో తగ్గించే పచ్చడి…

దేవుడి దగ్గర ఏ పూజలు జరిగినా తమలపాకులను విరివిగా వాడతారు. అవి ఎక్కువ మిగిలిపోతాయి. వాటిని నోట్లో  ఎక్కువ వేసుకుని తినలేము. ఇలా మిగిలిన వాటిని పడేయకుండా కూడా డైజెస్టివ్ ఎంజైన్స్ ని డైజేషన్ ని అద్భుతంగా  పెంచే  మెకానిజం ఈ తమలపాకులో  ఉంది. అందుకని జీర్ణ సమస్య ఉన్నవారికి గ్యాస్ ట్రబుల్ ఉన్నవారికి ఈ తమలపాకు రోటి పచ్చడి చాలా మంచిది. దీన్ని టమోటో కాంబినేషన్ లో టమాటాలు ఎక్కువ తమలపాకులు తక్కువ వేసుకొని ఈ చట్నీ ని చేసుకోవాలి. అప్పుడే ఘాటు అనేది తగ్గుతుంది. తమలపాకు చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. తమలపాకులు 10 తీసుకోవాలి.

                 టమాటా ముక్కలు ఒక కప్, పచ్చిమిర్చి రెండు, ఖర్జూరం ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు ఒక  టేబుల్ స్పూన్, మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక  టేబుల్ స్పూన్, మెంతులు ఒక  టీ స్పూన్, లెమన్ జ్యూస్ ఒక  టేబుల్ స్పూన్, మెంతులు ఒక  టేబుల్ స్పూన్, ఆవాలు ఒక  టీ స్పూన్, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి. ముందుగా నాన్ స్టిక్ పాత్రలో టమాటా ముక్కలు వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. దీనిలో ఉప్పు లేని లోటు తెలియకుండా ఉండడానికి ఖర్జూరం ముక్కలు వేసి ఉడికించాలి. తర్వాత మనం తీసుకున్న తమలపాకుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి టమాటా ముక్కల్లో వేసి వేయించుకోవాలి.

                  నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మీగడవేసి, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఈ తాలింపును మిక్సీ జార్లో వేసి కొద్దిగా పసుపు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిలోనే ఉడికిన టమాట, కొత్తిమీర కూడా వేసి, కొద్దిగా నిమ్మరసం కూడా వేసి గట్టి చట్నీలా చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మీగడ  వేసేసి తాలింపు వేసుకుంటే చాలా కమ్మగా, రుచిగా ఉంటుంది. మంచిగా తమలపాకులు ఉన్నప్పుడల్లా భోజనం తర్వాత తాంబూలంలా సున్నం పెట్టుకుని తినేస్తే  కాల్షియం కూడా లోపలికి వెళ్ళిపోతుంది.

                    అందుకనే మన పెద్దలు అటు డైజేషన్ కి, ఇటు ఎముకకి రెండింటి జంటకు వడ్డిస్తారు. అలా వాడుకుంటే మంచిది. మరి అందరి ఇళ్లలో  తమలపాకులు ఉంటూ ఉంటాయి. వాటిని ఈ విధంగా చట్నీలా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Leave a Comment

error: Content is protected !!