Healthy Rice Recipe for Lunch

కదంబ సాంబార్, రైస్ విడివిడిగా తింటే అమృతం! ఇదే ఆరోగ్యం…

మామూలు సాంబార్ అయితే పోషకాలు ఉండవు. ఉప్పు, కారం కలిపి నీళ్లులా ఉంటుంది. కానీ ఈ కదంబ సాంబార్ రైస్ అయితే చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. కదంబ రైస్ సాంబార్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. ముడి బియ్యం ఒక కప్పు, కందిపప్పు అర కప్పు, పెసరపప్పు అర కప్పు, టమాటా పేస్ట్ 2 కప్స్, వంకాయ ముక్కలు ఒక కప్పు, చిలకడదుంప ముక్కలు ఒక కప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, గుమ్మడికాయ ముక్కలు అర కప్పు, ముల్లంగి మొక్కలు అరకప్పు, సొరకాయ ముక్కలు అర కప్పు, ఖర్జూరం పేస్ట్ వన్ టేబుల్ స్పూన్, జీలకర్ర వన్ టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్, మీగడ వన్ టేబుల్ స్పూన్.

                      సాంబార్ పొడి ఒక  స్పూన్, మీగడ వన్ టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఉడికించడానికి పాత్ర పెట్టుకోవాలి. దీనిలో చిలకడదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలు, ముల్లంగి మొక్కలు, గుమ్మడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసి ఆవిరిలో ఈ వెజిటేబుల్ ముక్కల్ని ఉడకనివ్వాలి. మరొక చిన్న కుక్కర్లో మూడు బియ్యం తీసుకుని కడిగేసి వేసుకుని కందిపప్పు పెసరపప్పు కూడా దానిలో వేసేయాలి. వీటిని టమాటో పేస్టులో నీళ్లు కలిపి ఆ రసాన్ని పోసి నేనుకు బదులుగా ఈ టమాటా రసాన్ని పోసి ఉడికించాలి.

                      ఈ టమాటా రసంలో పప్పు బియ్యం ఉడికితే చెప్పదనం పోయి రుచిగా ఉంటుంది. మూడు విజిల్స్ వచ్చిన

తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఉడికించిన వెజిటేబుల్ ముక్కల్ని తాలింపు వేసుకుని మామూలుగా సాంబార్లో తక్కువ ముక్కలు వాడతారు కానీ మనం మూడు రెట్లు ఎక్కువ వాడుతున్నాం. ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వెజిటేబుల్స్ లో ఉడికించిన పప్పు రైస్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా సాంబార్ పొడి ఖర్జూరం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి చివరిగా కొబ్బరి తురుము వేసి మూత పెట్టి ఐదు పది నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు కదంబ రైస్ లో కొత్తిమీర చల్లుకోవాలి.

                     స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. చివరగా కొద్దిగా నిమ్మరసం పులుపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.

Leave a Comment

error: Content is protected !!