మునగాకు పెట్టింది పేరు. ఇందులో చాలా ఎక్కువగా కాల్షియం ఉంటుంది. బాలింతలకు పాల ఉత్పత్తిని పంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరియు దీంట్లో కావాల్సినన్ని పోషకాలు కూడా ఉంటాయి. కంటి చూపుని మెరుగుపరిచే విటమిన్ ఎ చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇలాంటి అనేక పోషకాలతో పాటు ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇందులో చక్కగా అన్నీ లభిస్తాయి కాబట్టి ఇటువంటి మునగాకుతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఈ పచ్చడి బాలింతలకు కూడా పెట్టుకోవచ్చు.
మునగాకు రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మునగాకు రెండు కప్పులు, వేరుశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు సరిపడినంత, వెల్లుల్లి ముక్కలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, మిగడ మూడు స్పూన్లు, తేనె ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, మెంతులు ఒక టీ స్పూన్, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక చిన్న కడాయి తీసుకుని అందులో ఒక స్పూన్ మిగడవేసి అందులో తాలింపుకు ఒక స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి.
తర్వాత వేరుశనగపప్పు వేసి ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేగనివ్వాలి. ఈ తాలింపులు వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక స్పూన్ మీగడవేసి అందులో మునగాకు వేసి బాగా వేగనివ్వాలి. మునగాకు చేదుగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న తాలింపులు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మునగాకును, తేనె, పసుపు, నిమ్మరసం వేసుకొని రోటి పచ్చడి లాగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు పచ్చడికి తాలింపు వేసుకోవాలి. దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో మీగడవేసి అందులో జీలకర్ర, మెంతులు, ఆవాలు, మినప్పప్పు వేసుకొని ఆ తర్వాత చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకుని స్టవ్ ఆపి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు మునగాకు రోటి పచ్చడి తయారవుతుంది. కాల్షియం పుష్కలంగా లభిస్తుంది కాబట్టి ఎముకలు గుల్లగా అవ్వకుండా సహాయపడుతుంది. ఈ పచ్చడిని వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేసుకుని తినడం వలన కంటి చూపు కూడా మెరుగు పడుతుంది…