మనం సాంబార్లోకి లేదా వేపుళ్ళలోకి కూరగాయలను ఉడికించి ఆ వచ్చిన నీటిని బయటకు పారబోస్తూ ఉంటాం. కానీ మనకు కూరగాయలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్‌ను అందిస్తాయి. మనం కూరగాయలను ఉడికించి నీటిని వంపి ఆ ముక్కలతో వంటకాలు తయారు చేసినప్పుడు కేలరీలు పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.
కొద్దిసేపు ఆవిరి, ఉడకబెట్టడం వలన బచ్చలికూర మరియు పాలకూర వంటి ఆకుకూరలు మరియు బ్రోకలీ మరియు కాలే వంటి క్రూసిఫెరస్ కూరగాయలు తమలో ఉన్న కొన్ని పోషకాలను కోల్పోతాయి. ఆ పోషకాలు మనం వంపేసిన నీటిలో ఉంటాయి. వండిన తర్వాత మిగిలిపోయిన నీరు కూడా పోషకాలను కలిగి ఉంటుంది కనుక మనం ఈ నీటిని ఇతర వంటకాల్లో ఉపయోగించవచ్చు. రసంలా పెట్టుకోవచ్చు లేదా క్యారెట్, స్వీట్ కార్న్ వంటివి కలిపి సూప్ తయారు చేసుకోవచ్చు.
ఇతర వంటకాలను తయారు చేయడానికి కూరగాయల నీటిని ఆదా చేసి సూప్ల వంటివి చేయడం ఇంటి స్త్రీలు మరియు ప్రొఫెషనల్ చెఫ్‌ల మధ్య ఒక ప్రసిద్ధ పద్ధతి. కూరగాయల నీటిని ఆదా చేయడం కూడా మీ వంటలో పోషకాలను సంరక్షించడానికి మరియు పోషకాలను మన శరీరానికి జోడించేటప్పుడు వ్యర్థం కాకుండా ఉండటానికి మంచి మార్గం.
కూరగాయలను ఉడికించడానికి ఆరోగ్యకరమైన మార్గాలు
ఈ నీటిని వంట ప్రక్రియలో ఉపయోగించడం వలన పోషకాలు నీటిలో కలిసిపోతాయి. వంట ప్రక్రియలో వచ్చిన నీటిని పారబోయడం వలన చాలామంది పోషకాలను కోల్పోతారు, ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్‌లు బి, సి మరియు ఫోలేట్ ఉన్నందున మీరు కూరగాయలను ఎలా ఉడికించాలి అనేది ముఖ్యం. ఇంట్లో స్త్రీలకు ఇటువంటి ఆహార విషయాలలో అవగాహన ఉండడం వలన ఆహారాలు పదార్థాలు వ్యర్థం కాకుండా పోషకాలను పొందవచ్చు.
వీలైనంతవరకు కూరగాయలను 70 శాతం ఉడికించి తీసుకోవాలి లేదా వీలైనంత పచ్చిగా తలాక్ కింద తీసుకోవడం చాలా మంచిది ఒకవేళ తప్పనిపరిస్థితుల్లో కూరగాయలను ఉడికించుకోవాల్సి వస్తే ఆ నీటిని వ్యర్థం చేయకుండా ఇతర కూరలలో గ్రేవీ కోసం ఉపయోగించవచ్చు లేదా కొద్దిగా మిరియాల పొడి సాల్ట్ కలిపి తాగవచ్చు. ఇలా ఈ నీటిని తీసుకోవడం వలన పోషకాలు జోడించడం జరుగుతుంది కానీ కేలరీలు కాదు. మీరు ఈ నీటిని తాగడం లేదా కూరగాయల నీరు రసంలా కూడా తీసుకోవడం తెలివైన మార్గం.